English | Telugu

అల్లుఅర్జున్,అట్లీ కథ ఇదేనా!.అందుకే ప్రియాంకచోప్రా వైపు చూస్తున్నారా!

ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్(Allu Arjun)అట్లీ(Atlee)కాంబోలో తెరకెక్కబోతున్నక్రేజీ ప్రాజెక్ట్ పై,ఇటీవల అల్లుఅర్జున్ బర్త్ డే సందర్భంగా అధికార ప్రకటన వచ్చిన విషయం తెలిసిందే.పైగా మేకర్స్ తమ చిత్రం ఎలా ఉండబోతుందో ఒక వీడియో కూడా రిలీజ్ చేసారు.ఆ వీడియో చూస్తే అంతర్జాతీయప్రమాణాలతో,అంతర్జాతీయ టెక్నీషియన్స్ తో తెరకెక్కబోతుందనే విషయం అర్ధమవుతుంది.దీన్నిబట్టి కథ కూడా అంతే స్థాయిలో ఉంటుందని ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు.
.
ఇప్పుడు అందుకు తగ్గట్టుగానే నటీనటుల ఎంపిక ఉండబోతుంది.ఈ క్రమంలోనే అల్లు అర్జున్ సరసన ప్రియాంకచోప్రా(Priyanka Chopra)జోడి కట్టబోతుందనే ప్రచారం జరుగుతుంది.ప్రియాంక బాలీవుడ్ తో పాటు హాలీవుడ్ లో కూడా నటిస్తు తన సత్తా చాటుతుంది.దీంతో ప్రియాంకని తమ చిత్రంలోకి తీసుకుంటే మూవీకి హెల్ప్ అవుతుందని టీం భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. త్వరలోనే మేకర్స్ ప్రియాంకని సంప్రదించబోతున్నారని కూడా వార్తలు వస్తున్నాయి.ప్రియాంక ఇప్పటికే మహేష్(Mahesh Babu)రాజమౌళి(Rajamouli)సినిమాలో చేస్తుంది.ఈ చిత్రం కూడా అంతర్జాతీయ ప్రమాణాలతో రూపుదిద్దుకుంటుంది.అందుకే ప్రియాంకని రాజమౌళి టీం ఎంపిక చేసింది.


వరల్డ్ సినీ మార్కెట్ ని దృష్టిలో ఉంచుకొని అల్లుఅర్జున్,అట్లీ చిత్రం తెరకెక్కుతుండగా,సన్ పిక్చర్స్ అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిస్తుంది.ఈ ఏడాది చివర్లో మూవీ ప్రారంభం కాబోతుంది.పుష్ప2 లాంటి పాన్ ఇండియా హిట్ తర్వాత అల్లుఅర్జున్ చేస్తున్న ఈ మూవీపై అభిమానులతో పాటు ప్రేక్షకుల్లోను భారీ అంచనాలు ఉన్నాయి.షారుక్ తో జవాన్ చేసిన రెండేళ్ల తర్వాత అట్లీ ఈ మూవీ చేస్తున్నాడు.

అఖండ 2 ఆగినప్పుడు తెరవెనుక ఉంది వీళ్లే.. గంగాధర శాస్త్రి చెప్పిన పచ్చి నిజాలు  

నందమూరి నటసింహం గాడ్ ఆఫ్ మాసెస్ 'బాలకృష్ణ'(Balakrishana)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ వద్ద 'అఖండ 2'(Akhanda 2)తో కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ ని అందుకున్నాడు. దీంతో హిట్ ల శాతం తక్కువగా ఉన్న ప్రస్తుత సినీ యుగంలో వరుసగా ఐదు విజయాలని అందుకున్న హీరోగా  చరిత్రనే సృషించాడు . కలెక్షన్స్ పరంగా కూడా అఖండ 2 తొలి రోజు వరల్డ్ వైడ్ గా ప్రీమియర్స్ తో కలుపుకొని 59 .5 కోట్ల రూపాయిల గ్రాస్ ని అందుకోవడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. మేకర్స్ కూడా త్వరలోనే రెండు తెలుగు రాష్టాల్లో సక్సెస్ సెలబ్రేషన్స్ ని జరుపుతున్నారు.

Akhanda 2: ఫస్ట్ డే రికార్డు కలెక్షన్స్ 

గాడ్ ఆఫ్ మాసెస్ 'బాలకృష్ణ'(Balakrishna)మరోసారి సిల్వర్ స్క్రీన్ పై 'అఖండ 2'(Akhanda 2)తో తన సత్తాని చాలా స్పష్టంగా చాటుతున్నాడు. ప్రీమియర్స్ నుంచే ఫ్యాన్స్ తో పాటు మూవీ లవర్స్ భారీగా థియేటర్స్ కి పోటెత్తారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు వరల్డ్ వైడ్ గా అఖండ 2 థియేటర్స్ దగ్గర పండుగ వాతావరణం కనిపించింది. మూవీ చూసిన అభిమానులు, ప్రేక్షకులు స్పందిస్తు 'అఖండ క్యారక్టర్ లో బాలయ్య తన కళ్ళతోనే క్యారక్టర్ యొక్క స్వరూపాన్ని ప్రదర్శించాడు. దీంతో మరోసారి బాలయ్య నట విశ్వరూపాన్నిచూసే అవకాశం లభించింది. బోయపాటి(Boyapati Srinu)బాలయ్య కాంబో మరో సారి మెస్మరైజ్ చేసిందని ముక్త కంఠంతో చెప్తున్నారు. దీంతో తొలి రోజు బాలకృష్ణ రికార్డు కలెక్షన్స్ ని తన ఖాతాలో వేసుకున్నాడు.