English | Telugu

శ్రీకాంత్ అడ్డాల రూట్ సపరేటు !

"పురుషులందు పుణ్య పురుషులు వేరయా" అన్నట్లు.. దర్శకులందు శ్రీకాంత్ అడ్డాల రూట్ సపరేట్ అని చెప్పొచ్చు.. ఒక హిట్టు రాగానే.. రెండు మూడు సినిమాలకు అడ్వాన్సులు తీసేసుకొని నాలుగైదు ఫ్లాట్స్ తీసేసుకొని పండగ చేసుకుంటున్న దర్శకులున్న కాలంలో.. "సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు" వంటి సూపర్‌హిట్ తర్వాత కూడా.. తదుపరి చిత్రం విషయమై ఇప్పటికీ తేల్చుకోలేకపోతున్నాడు.

"సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు" విడుదలై ఆరు నెలలు కావస్తున్నా.. శ్రీకాంత్ అడ్డాల నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏమిటనే దానిపై ఇంకా క్లారిటీ లేదు. స్వతహా శ్రీకాంత్ అడ్డాల అంతే. దర్శకుడిగా అతని తొలి చిత్రం "కొత్తబంగారు లోకం" ఘన విజయం సాధించినప్పటికీ.. రెండో చిత్రం "సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు" కోసం సుమారు అయిదేళ్లు నిరీక్షించాడు. చూస్తుంటె ఇప్పుడు మూడో చిత్రం కోసం కూడా అతను అంతే సమయం తీసుకునేట్లు ఉన్నాడు. నిజానికి.. శ్రీకాంత్ అడ్డాల మూడో చిత్రం.. నాగబాబు తనయుడు వరుణ్‌తేజ్‌తో ఉంటుందని ఆమధ్య వార్తలు వెలువడ్డాయి. కానీ.. ఆ తర్వాత శ్రీకాంత్ అడ్డాల స్థానంలో మరికొందరు దర్శకుల పేర్లు తెరపైకి వచ్చాయి!