English | Telugu
అందగత్తె ఛాన్స్ కొట్టింది
Updated : Jan 17, 2015
అమ్మాయిలు అందంగా వుంటేనే సరిపోదు... వారికి అదృష్టం కూడా కలసి రావాలి. సినిమా హీరోయిన్లకు కూడా ఈ సూత్రం వర్తిస్తుంది. అచ్చ తెలుగమ్మాయి శ్రీదివ్య అందంగా వుండటం మాత్రమే కాదు.. అదృష్టవంతురాలని కూడా ఆమె కెరీర్ గ్రాఫ్‌ని చూస్తే అనిపిస్తుంది. తెలుగమ్మాయి అయినప్పటికీ శ్రీదివ్యకి తమిళ సినిమా రంగంలో యమా క్రేజ్ ఏర్పడింది. క్రేజ్‌తోపాటు హిట్లు కూడా ఈ అందగత్తె అకౌంట్లో జమ అయ్యేసరికి మార్కెట్లో డిమాండ్ కూడా పెరిగింది. ఇదిలా వుంటే అటు తమిళంతోపాటు ఇటు తెలుగులో కూడా మంచి గుర్తింపు సంపాదించుకున్న కార్తీ ఇప్పుడొక క్రేజీ ప్రాజెక్టులో నటిస్తున్నాడు. ఆ సినిమాకి గోకుల్ డైరెక్టర్. సినిమా పేరు ‘కాష్మోరా’. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు వుంటారు. ఇప్పటికే నయనతార ఒక హీరోయిన్‌గా ఎంపికైంది. మరో హీరోయిన్ పాత్రలో నటించడం కోసం తమిళంలో బిజీ హీరోయిన్లందరూ భారీ స్థాయిలో ప్రయత్నాలు చేశారు. అయితే ఆ హీరోయినల్లో శ్రీదివ్య మాత్రం లేదు. కానీ లక్కేంటంటే, తాను ఎంతమాత్రం ప్రయత్నించకపోయినా ఆ హీరోయిన్ కేరెక్టర్ శ్రీ దివ్యని వెతుక్కుంటూ వచ్చింది. తాను ఎంతమాత్రం ఊహించకుండా లభించిన ఈ అవకాశం శ్రీదివ్యని ఉక్కిరిబిక్కరి చేస్తోంది.