English | Telugu

అల్లు అర్జున్‌ని ఫ్లాట్ చేసిన దర్శకుడు

అల్లువారబ్బాయి అల్లు అర్జున్ సినిమాకి దర్శకత్వం వహించే ఛాన్స్ వచ్చిందంటే నేటి యువ దర్శకులకు అక్కీ ఛాన్స్ దక్కినట్టే. ఇప్పుడా లక్కీ ఛాన్స్‌ని యువ దర్శకుడు విజయకుమార్ కొండా సొంతం చేసుకున్నాడు. ‘గుండెజారి గల్లంతయ్యిందే’, ‘ఒక లైలా కోసం’ సినిమాలో హిట్లు కొట్టిన విజయకుమార్ కొండా తదుపరి చిత్రం ఏమిటా... ఏ హీరోతో చేయబోతున్నాడా అన్న ఆసక్తి నెలకొని వుంది. ఈ నేపథ్యంలో ఆయన తదుపరి హీరో అల్లు అర్జున్ అనే విషయం రివీల్ అయింది. ఈమధ్యే విజయకుమార్ కొండా అల్లు అర్జున్‌కి ఒక వెరైటీ స్క్రిప్ట్ వినిపించాడని, ఆ స్క్రిప్ట్ వినగానే ఫ్లాటైపోయిన అల్లు అర్జున్ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడని తెలుస్తోంది. ప్రస్తుతం అల్లు అర్జున్ త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక ప్రాజెక్టుకు కమిట్ అయ్యాడు. ఆ ప్రాజెక్టు పూర్తి అవ్వగానే విజయకుమార్ కొండా దర్శకత్వం వహించే సినిమా పట్టాల మీదకు ఎక్కుతుందని తెలుస్తోంది. ఏది ఏమైనప్పటికీ ఇది విజయకుమార్ కొండాకి కొండంత అవకాశం.