English | Telugu

త్వ‌ర‌లో టాప్ హీరోతో శ్రీ‌ను వైట్ల సంచ‌ల‌న చిత్రం!?

తనదైన శైలిలో వినోదాన్ని పండిస్తూ బ్లాక్ బస్టర్స్ అందించి ట్రెండ్ సెట్టర్‌గా నిలిచారు ద‌ర్శ‌కుడు శ్రీ‌ను వైట్ల‌. 23 సంవ‌త్స‌రాల క్రితం ర‌వితేజ హీరోగా న‌టించిన‌ 'నీ కోసం' (1999) మూవీతో దర్శకుడిగా పరిచయ‌మై, మొదటి చిత్రంతోనే ఉత్తమ నూతన దర్శకుడిగా నంది అవార్డ్ అందుకుని సక్సెస్‌ఫుల్‌గా తన కెరీర్ మొదలు పెట్టారు.

అందరూ కొత్తవారితో నిర్మించిన 'ఆనందం' (2002)తో భారీ విజయం సాధించి పరిశ్రమలో సంచలనం సృష్టించారు. వెంకీ, ఢీ, దుబాయ్ శీను, రెడీ, కింగ్, నమో వెంకటేశ లాంటి మెమొరబుల్ హిట్స్ సాధించిన శ్రీను వైట్ల 'దూకుడు' (2011)తో తిరుగులేని హిట్ కొట్టారు. తర్వాత వచ్చిన 'బాద్ షా' (2013)తో మరో బ్లాక్ బస్టర్ అందుకున్నారు.

టాలీవుడ్ లో అందరు స్టార్ హీరోల చిత్రాలకు దర్శకత్వం వహించి హిట్ చిత్రాలు అందించిన ఘనత శ్రీను వైట్ల సొంతం. నేడు (సెప్టెంబర్ 24) పుట్టిన‌రోజు జరుపుకుంటున్న శ్రీను వైట్ల అతి త్వ‌ర‌లో ఒక అగ్ర హీరోతో కలిసి భారీ ప్రాజెక్ట్ తో మరో సారి తన మ్యాజిక్ రిపీట్‌ చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ కాంబినేషన్ కి సంబంధించిన ప్రకటన అతి త్వరలో వెలువడనుంది. చ‌క్క‌ని కథతో పాటు తన మార్క్ వినోదంతో ఈ చిత్రాన్ని తీయ‌బోతున్న‌ట్లు స‌మాచారం. ఈ రోజు (సెప్టెంబ‌ర్ 24) పుట్టిన‌రోజు జ‌రుపుకుంటున్న శ్రీ‌ను వైట్ల‌కు శుభాకాంక్ష‌లు.

అఖండ 2 ఆగినప్పుడు తెరవెనుక ఉంది వీళ్లే.. గంగాధర శాస్త్రి చెప్పిన పచ్చి నిజాలు  

నందమూరి నటసింహం గాడ్ ఆఫ్ మాసెస్ 'బాలకృష్ణ'(Balakrishana)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ వద్ద 'అఖండ 2'(Akhanda 2)తో కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ ని అందుకున్నాడు. దీంతో హిట్ ల శాతం తక్కువగా ఉన్న ప్రస్తుత సినీ యుగంలో వరుసగా ఐదు విజయాలని అందుకున్న హీరోగా  చరిత్రనే సృషించాడు . కలెక్షన్స్ పరంగా కూడా అఖండ 2 తొలి రోజు వరల్డ్ వైడ్ గా ప్రీమియర్స్ తో కలుపుకొని 59 .5 కోట్ల రూపాయిల గ్రాస్ ని అందుకోవడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. మేకర్స్ కూడా త్వరలోనే రెండు తెలుగు రాష్టాల్లో సక్సెస్ సెలబ్రేషన్స్ ని జరుపుతున్నారు.

Akhanda 2: ఫస్ట్ డే రికార్డు కలెక్షన్స్ 

గాడ్ ఆఫ్ మాసెస్ 'బాలకృష్ణ'(Balakrishna)మరోసారి సిల్వర్ స్క్రీన్ పై 'అఖండ 2'(Akhanda 2)తో తన సత్తాని చాలా స్పష్టంగా చాటుతున్నాడు. ప్రీమియర్స్ నుంచే ఫ్యాన్స్ తో పాటు మూవీ లవర్స్ భారీగా థియేటర్స్ కి పోటెత్తారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు వరల్డ్ వైడ్ గా అఖండ 2 థియేటర్స్ దగ్గర పండుగ వాతావరణం కనిపించింది. మూవీ చూసిన అభిమానులు, ప్రేక్షకులు స్పందిస్తు 'అఖండ క్యారక్టర్ లో బాలయ్య తన కళ్ళతోనే క్యారక్టర్ యొక్క స్వరూపాన్ని ప్రదర్శించాడు. దీంతో మరోసారి బాలయ్య నట విశ్వరూపాన్నిచూసే అవకాశం లభించింది. బోయపాటి(Boyapati Srinu)బాలయ్య కాంబో మరో సారి మెస్మరైజ్ చేసిందని ముక్త కంఠంతో చెప్తున్నారు. దీంతో తొలి రోజు బాలకృష్ణ రికార్డు కలెక్షన్స్ ని తన ఖాతాలో వేసుకున్నాడు.