English | Telugu

అమెరికాలో 'పోకిరి', 'జ‌ల్సా' వ‌సూళ్ల‌ను దాటిన‌ 'చెన్న‌కేశ‌వ‌రెడ్డి'

నంద‌మూరి బాల‌కృష్ణ టైటిల్ రోల్‌లో న‌టించగా, వి.వి. వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన‌ 'చెన్న‌కేశ‌వ‌రెడ్డి' చిత్రం విడుద‌లై సెప్టెంబ‌ర్ 25కు ఇర‌వై ఏళ్లు నిండుతున్నాయి. ఈ సంద‌ర్భంగా ఆ సినిమాను రిరిలీజ్ చేశారు నిర్మాత బెల్లంకొండ సురేశ్‌. ఈరోజు ప్రీమియ‌ర్స్‌తో ఆ సినిమా రిలీజైంది. కాగా అమెరికాలో స్పెష‌ల్ షోస్‌తో 'చెన్న‌కేశ‌వ‌రెడ్డి' సంచ‌ల‌నం సృష్టించింది. 38 సెంట‌ర్ల‌లో 82 షోస్‌కు 3119 టికెట్లు అమ్ముడ‌వ‌గా, 39,054 డాల‌ర్ల గ్రాస్ వ‌చ్చింది. స్పెష‌ల్ షోస్‌కు సంబంధించిన ఇది రికార్డ్‌.

ఇంత‌కు ముందు స్పెష‌ల్ షోస్ ట్రెండ్‌ను మ‌హేశ్ పుట్టిన‌రోజున‌ 'పోకిరి' మూవీ స్టార్ట్ చేసింది. ఆ సినిమా షోస్‌కు వ‌చ్చిన స్పంద‌న‌తో ప‌వ‌న్ క‌ల్యాణ్ పుట్టిన‌రోజున 'జ‌ల్సా' స్పెష‌ల్ షోలు వేశారు. అది 'పోకిరి'ని మించిన వ‌సూళ్ల‌ను సాధించింది. దాంతో ప‌వ‌న్ ఫ్యాన్స్ త‌మ హీరో సినిమా స్పెష‌ల్ షోస్‌లో రికార్డు సృష్టించిందంటూ సంబ‌రాలు చేసుకున్నారు. సోష‌ల్ మీడియాలో హంగామా చేశారు.

కానీ మూడు వారాలు తిరిగేస‌రిక‌ల్లా అమెరికాలో ఆ రికార్డును 'చెన్న‌కేశ‌వ‌రెడ్డి' చెరిపేశాడు. నిజానికి 20 ఏళ్ల క్రితం విడుద‌లైన‌ప్పుడు 'చెన్న‌కేశ‌వ‌రెడ్డి' బాక్సాఫీస్ ద‌గ్గ‌ర యావ‌రేజ్ క‌లెక్ష‌న్ల‌ను మాత్ర‌మే రాబ‌ట్టింది. 'పోకిరి'లాగా అది ఇండ‌స్ట్రీ హిట్ కాదు, 'జ‌ల్సా' లాగా హిట్టూ కాదు. అయినా కూడా, యు.ఎస్‌.లో స్పెష‌ల్ షోస్ ప‌రంగా అత్య‌ధిక టికెట్లు అమ్ముడైన సినిమాగా, అత్య‌ధిక గ్రాస్ వ‌సూలు చేసిన సినిమాగా సరికొత్త రికార్డులు సృష్టించింది.

బాల‌కృష్ణ డ‌బుల్ రోల్ చేసిన 'చెన్న‌కేశ‌వ‌రెడ్డి' మూవీలో ట‌బు, శ్రియ హీరోయిన్లుగా న‌టించ‌గా, దేవ‌యాని, జయప్రకాశ్ రెడ్డి, చలపతి రావు, ఆహుతి ప్రసాద్, రఘుబాబు, బ్రహ్మానందం, అలీ, ఎల్బీ శ్రీరాం, ఎమ్మెస్ నారాయణ, వేణుమాధవ్ ఇత‌ర కీల‌క పాత్ర‌లు చేశారు. ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్ రాసిన‌ సంభాష‌ణ‌లు, మ‌ణిశ‌ర్మ సంగీతం స‌మ‌కూర్చిన పాట‌లు పాపుల‌ర్ అయ్యాయి.

అఖండ 2 ఆగినప్పుడు తెరవెనుక ఉంది వీళ్లే.. గంగాధర శాస్త్రి చెప్పిన పచ్చి నిజాలు  

నందమూరి నటసింహం గాడ్ ఆఫ్ మాసెస్ 'బాలకృష్ణ'(Balakrishana)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ వద్ద 'అఖండ 2'(Akhanda 2)తో కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ ని అందుకున్నాడు. దీంతో హిట్ ల శాతం తక్కువగా ఉన్న ప్రస్తుత సినీ యుగంలో వరుసగా ఐదు విజయాలని అందుకున్న హీరోగా  చరిత్రనే సృషించాడు . కలెక్షన్స్ పరంగా కూడా అఖండ 2 తొలి రోజు వరల్డ్ వైడ్ గా ప్రీమియర్స్ తో కలుపుకొని 59 .5 కోట్ల రూపాయిల గ్రాస్ ని అందుకోవడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. మేకర్స్ కూడా త్వరలోనే రెండు తెలుగు రాష్టాల్లో సక్సెస్ సెలబ్రేషన్స్ ని జరుపుతున్నారు.

Akhanda 2: ఫస్ట్ డే రికార్డు కలెక్షన్స్ 

గాడ్ ఆఫ్ మాసెస్ 'బాలకృష్ణ'(Balakrishna)మరోసారి సిల్వర్ స్క్రీన్ పై 'అఖండ 2'(Akhanda 2)తో తన సత్తాని చాలా స్పష్టంగా చాటుతున్నాడు. ప్రీమియర్స్ నుంచే ఫ్యాన్స్ తో పాటు మూవీ లవర్స్ భారీగా థియేటర్స్ కి పోటెత్తారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు వరల్డ్ వైడ్ గా అఖండ 2 థియేటర్స్ దగ్గర పండుగ వాతావరణం కనిపించింది. మూవీ చూసిన అభిమానులు, ప్రేక్షకులు స్పందిస్తు 'అఖండ క్యారక్టర్ లో బాలయ్య తన కళ్ళతోనే క్యారక్టర్ యొక్క స్వరూపాన్ని ప్రదర్శించాడు. దీంతో మరోసారి బాలయ్య నట విశ్వరూపాన్నిచూసే అవకాశం లభించింది. బోయపాటి(Boyapati Srinu)బాలయ్య కాంబో మరో సారి మెస్మరైజ్ చేసిందని ముక్త కంఠంతో చెప్తున్నారు. దీంతో తొలి రోజు బాలకృష్ణ రికార్డు కలెక్షన్స్ ని తన ఖాతాలో వేసుకున్నాడు.