English | Telugu

క్రిస్ గేల్ తో జూనియర్ ఐశ్వర్యారాయ్ పార్టీ

అసలు వీళ్లిద్దరికీ లింక్ ఎట్టా అని ఫస్ట్ డౌట్ కదా. కానీ అట్టా కుదిరిపోయింది మరి. గేల్ మాత్రమే కాదు, వెస్టిండీస్ క్రికెట్ టీం అందరితో కలిసి పార్టీ చేసుకుంది ఉల్లాల్. ఇప్పుడు జరుగుతున్న టి20 వరల్డ్ కప్ స్టార్టవ్వడానికి కొద్ది రోజుల ముందు జరిగిన పార్టీ ఇది. వెస్టిండీస్ స్టార్ ప్లేయర్ డ్వేన్ బ్రావో తను స్వయంగా పాడి కంపోజ్ చేసిన ' ఛాంపియన్ ' అనే పాటను రిలీజ్ చేశాడు.

దీన్ని ఇండియాలో వేగా ఎంటర్ టైన్మెంట్ రిలీజ్ చేసింది. ఆ సందర్భంగా స్నేహను స్పెషల్ గెస్ట్ గా ఇన్వైట్ చేసిందీ కంపెనీ. దాంతో స్నేహమ్మ ఆనందాన్ని హద్దుల్లేవ్. క్రికెటర్లతో వీరలెవెల్లో ఫోటోలు, డిస్కషన్లు పెట్టేసింది. ఫోటోలు చూశారుగా. క్రిస్ గేల్ తో ఏదో సీరియస్ డిస్కస్ చేసేస్తోంది అమ్మడు.

ఈ ఫోటోలన్నీంటినీ తన ఇన్ స్టాగ్రాం లో పోస్ట్ చేసింది. జూనియర్ ఐశ్వర్యారాయ్ అని పేరు తెచ్చుకుని సల్మాన్ ఖాన్ లక్కీతో సినిమాల్లోకి వచ్చిన స్నేహా ఉల్లాల్ ఆ తర్వాత కొన్ని తెలుగు సినిమాలు చేసినా, స్టార్ గా క్లిక్కవ్వలేకపోయింది. సింహా, ఉల్లాసంగా ఉత్సాహంగా లాంటి సూపర్ హిట్స్ కెరీర్లో ఉన్నా, మంచి అందంతో కవ్విస్తున్నా, ఎందుకో పాపం ఉల్లాల పాప వెనకబడిపోయింది. ఎప్పటికైనా తనకు బ్రేక్ రాకపోతుందా అని ఇంకా వెయిట్ చేస్తోందీ పిల్లికళ్ల సుందరి.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.