English | Telugu

మంచు విష్ణు ఈడో రకం, రాజ్ తరుణ్ ఆడో రకం

మంచు వారి ఫ్యామిలీతో ఇంతకు ముందు అల్లరి నరేష్, వరుణ్ సందేశ్, తనీష్ లు కలిసి నటించారు. లేటెస్ట్ గా ఈ లిస్ట్ లోకి రాజ్ తరుణ్పేరు చేరింది. మంచు విష్ణు, రాజ్ తరుణ్ ఇద్దరూ కలిసి ప్రేక్షకులతో ఈడో రకం, ఆడో రకం అనిపించడానికి రెడీ అవుతున్నారు. వీళ్లిద్దరికీజంటగా సోనారిక, హెబ్బాపటేల్ నటిస్తున్నారు. ఏకే ఎంటర్ టైన్మెంట్స్ ప్రొడక్షన్ పై తెరకెక్కుతున్న ఈ మల్టీ స్టారర్ కు, నాగేశ్వరరెడ్డిదర్శకుడు. ఈరోజు మూవీ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్ టైనర్ గా ప్రేక్షకుల్ని అలరిస్తుందని ఏప్రిల్ 14 న రిలీజ్చేస్తామని నిర్మాతలు చెబుతున్నారు. లీడ్ పెయిర్ తో పాటు రాజేంద్రప్రసాద్, పోసాని, రఘబాబు, వెన్నెల కిషోర్, హేమ తదితరులునటిస్తున్నారు.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.