English | Telugu

మరో కొత్త వివాదంలో ఇరుక్కున్న చిన్మయి!

వివాదాస్పద వ్యాఖ్యలను ఖండించాలన్నా, వివాదాస్పద వ్యాఖ్యలు చేయాలన్నా, తప్పుగా మాట్లాడేవారిని ఏకెయ్యాలన్నా చిన్మయి తర్వాతే ఎవరైనా. సింగర్‌గా, డబ్బింగ్‌ ఆర్టిస్టుగా ఎంత ఫేమస్సో.. వివాదాలతో కూడా అంతే ఫేమస్‌. మహిళలకు ఎదురయ్యే సమస్యలపై పోరాటం చేయడానికి సోషల్‌ మీడియాలో ఎక్కువ దర్శనమిస్తూ ఉంటుంది. తాజాగా ఓ నెటిజన్‌ చున్నీ వివాదానిÊ్న లేవనెత్తాడు. తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను షేర్‌ చేశాడు. ఆ వీడియోలో.. ‘ఇప్పుడు ఈ న్యూ ట్రెండ్‌ ఫ్యాషన్‌ అనుకుంటా.. చున్నీ వేసుకోకుండా బయట తిరిగే ప్రతీ అమ్మాయికి.. నాకు అనిపించింది నేను చెప్పుతున్నా. చూసే చూపు మంచిదైతే అన్నీ మంచిగా కనపడతాయని మీరు అనుకోవచ్చు. కానీ, మీరు ఇది గుర్తు పెట్టుకోండి.. బయట ఉండే వాళ్ల అందరి చూపులు ఒకే రకంగా ఉండవు. మీరు వేసుకొనే రూ.100 చున్నీ వల్ల వాళ్ళ నుంచి మీకు.. మీ కుటుంబానికి కొన్ని కోట్ల రూపాయల విలువైన రెస్పెక్ట్‌ దొరుకుతుంది’’ అంటూ పోస్ట్‌ చేశాడు.

దీనిపై చిన్మయి స్పందిస్తూ ‘‘అందరి దగ్గరా ఫోన్‌ ఉంది. అందరి ఫోన్లనో కెమెరా ఉంది. రీమిక్స్‌ చేసుకోవచ్చు. మ్యూజిక్‌ పెట్టుకుని చ.జ.జా అంటూ స్లోమోషన్‌లో.. ఫిల్టర్‌ పెట్టుకుని ఎవరెవరో ఏదెదో చెప్పవచ్చు. ఏమైనా చేయవచ్చు. కానీ, ఈ అబ్బాయిలకి చున్నీ మీద అంత ఇంట్రస్ట్‌ ఎందుకో.. చున్నీ మీద అంత పట్టుదల ఉంటే వాళ్లే కొని వేసుకోవచ్చుగా. అమ్మాయిలూ! చున్నీ కోట్ల రూపాయల రెస్పెక్ట్‌ ఇస్తుంది. ఆ కోట్ల రూపాయలు ఉంటే.. హైదరాబాదులో చాలా విల్లాస్‌ ఉన్నాయి. రెండు ప్రాపర్టీస్‌ కొని.. ఒకటి అద్దెకి ఇచ్చి ఇంకోదానిలో మీరే హాయిగా లైఫ్‌ని గడపండి. దయచేసి ఇలాంటి అబ్బాయిలను డెటింగ్‌ చేయవద్దు, పెళ్లి చేసుకొవద్దు’’ అంటూ సమాధానమిచ్చింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారింది.