English | Telugu
రజనీ డాటర్, శింభుల మధ్య వార్
Updated : Jun 12, 2014
తన ప్రేమ వ్యవహారాలతో వార్తలలో నిలిచే శింభు ఈ సారి రూటు మార్చినట్లు కనిపిస్తోంది. సూపర్‌స్టార్ రజనీ సినిమాని కామెంట్ చేసి సంచలనంగా మారాడు. రజనీ లేటెస్ట్ సినిమా కొచ్చాడయన్ హాలీవుడ్ చిత్రాలను మించిన విధంగా రూపొందుతుందని అనుకున్నాను, కానీ గ్రాఫిక్స్ అలా లేకపోవటం ఆశ్చర్యంగా అనిపించింది అని శింభు కామెంట్ చేశాడట.
మరో పక్కన కొచ్చాడయాన్ దర్శకురాలు సౌందర్య ఒక నేషనల్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో, ఒక ప్రశ్నకు సమాధానంగా, శింభుకి ఏమైనా చెప్పాల్సి వస్తే పాటలు పాడటం మానేయని చెప్తాను అని జవాబిచ్చింది.
దీంతో వీరిద్దరి మధ్య కోల్డ్ వార్ జరుగుతోందని అందరూ భావించారు. ఈ లోపు శింభూ అభిమానులు మాత్రం సౌందర్య కామెంట్స్ ని సీరియస్ గా తీసుకుని సోషల్ మీడియాలో తమ ఆగ్రహాన్ని వెలుబుచ్చుతున్నారు. ఆమెపై తీవ్రమైన కామెంట్స్ చేయడం మొదలుపెట్టారు. అయితే ఈ పరిస్థితిని శింభూ చాలా మెచ్యూరిటీతో హ్యాండిల్ చేశారని చెప్పాలి. ఎవరికైనా తమ అభిప్రాయాలను ఎక్స్ ప్రెస్ చేసే హక్కుందని, తన అభిప్రాయాలను గౌరవించినట్లే ఇతరులు అభిప్రాయాలను గౌరవించమని అభిమానులను కోరాడు శింభూ. దీనితో అయినా ఫ్యాన్స్ కోపం తగ్గుతుందేమో చూడాలి.
మరో వైపు సౌందర్య కూడా శింభూ కామెంట్ కి ఠక్కున జవాబు ఇచ్చింది. శింభూ తన చిన్ననాటి స్నేహితుడు, నేనన్నది కేవలం సరదాగానే, మా ఇద్దరి మధ్య ఎటువంటి గొడవలు లేవని సౌందర్య చెప్పుకొచ్చింది. ఇంతటితో ఈ వివాదం సద్దుమనుగుతుందనే అనుకోవాలి.