English | Telugu
షారుఖ్ అత్యంత సాధారణ నటుడట..!
Updated : Apr 5, 2016
బాలీవుడ్ లో ఖాన్ హీరోలదే అగ్రస్థానం. వారిలో కూడా కింగ్ ఖాన్ అని పిలిచేది షారుఖ్ ని మాత్రమే. హిందీ చిత్ర పరిశ్రమతో పాటు దేశవ్యాప్తంగా ఎంతోమంది అభిమానులు షారుఖ్ సొంతం. ఎన్నో వైవిధ్యమైన పాత్రలు చేయడంలో కింగ్ ఖాన్ ఆరితేరిపోయాడు. కానీ షారుఖ్ మాత్రం, తనను తాను చాలా సాధారణ నటుడని అనుకుంటాడట. అంతే కాదు, తాను చాలా సెంటిమెంటల్ అండ్ సెన్సిటివ్ అని, అందుకే ఒక పాత్ర తాలూకు ఎమోషన్స్ ను పాత్ర పలికించాల్సిన దానికంటే ముందే చేసేస్తానని, అందువల్లే తనను తాను మంచి నటుడుగా భావించనని చెబుతున్నాడు. ఫ్యాన్స్ అందరికీ నచ్చే విధంగా సినిమా చేయడం వీలు కాదని, తనకు నచ్చినవి చేస్తే, ఫ్యాన్స్ వాటిని ఆదరిస్తారని తాను అనుకుంటానని హానెస్ట్ గా చెప్పేస్తున్నాడు బాలీవుడ్ బాద్ షా. షారుఖ్ ఇంత ఖచ్చితంగా నేను మంచి నటుడ్ని కాదని చెబుతుంటే, ఎంత గొప్పవాడు కాకపోతే, తనంత తానుగా తాను మంచి నటుడ్ని కాదని షారుఖ్ అనగలడు అంటూ బాద్ షా ఫ్యాన్స్ తెగ ఆనందపడిపోతున్నారు. ఏదేమైనా, బాలీవుడ్ హీరోల్లో షారుఖ్ చాలా కలుపుగోలు మనిషి అనేది మాత్రం ఎవరూ కాదనలేని మాట..!