English | Telugu
మళ్లీ ఒక్కటవుతున్న ప్రేమపావురాలు..!
Updated : Apr 5, 2016
బాలీవుడ్ లో ఏ జంట మధ్య లవ్ ఎప్పుడు పుడుతుందో, అంతలోనే ఎందుకు బ్రేకప్ అవుతుందోనన్నది చిదంబర రహస్యమే. ఒక స్టార్ లవ్ కపుల్. బాగా కలిసి తిరిగారు. ఫోటోలకు ఫోజులిచ్చారు. ఇద్దరూ కలిసి ఒకే ఇంటికి మూవ్ అయిపోయారు కూడా. కానీ ఏమైందో ఏమో ఒక్కసారిగా మనస్పర్ధలొచ్చేశాయి. ఇద్దరూ కలిసి కట్టుకున్న లవ్ నెస్ట్ నుంచి ఒక పావురం ఎగిరిపోయింది. ఇద్దరూ ఎక్కడ ఎదురుపడినా ఎడమొఖం, పెడమొఖమే. ఈ ప్రేమపక్షుల పేర్లు రణ్ బీర్ కపూర్, కత్రినా కైఫ్. గత రెండేళ్లుగా వీళ్ల గురించి రాసినంతగా మరే కపుల్ గురించీ సినీ జర్నల్స్ రాయలేదు. బ్రేకప్ అయిపోయినా, ఇద్దరూ ప్రొఫెషనల్స్ కాబట్టి, జగ్గాజాసూస్ సినిమాలో కలిసి నటిస్తున్నారు. అయితే సినిమా వర్కింగ్ వరకూ ఓకే గానీ, ఫంక్షన్స్ కు అటెండ్ అయినప్పుడు కూడా ఇద్దరి మధ్యా బంధంలో ఏమాత్రం ఇంప్రూవ్ మెంట్ లేదు.
కానీ వీరిద్దరికీ కామన్ ఫ్రెండ్ అయిన ఆర్తి పుట్టిన రోజున మాత్రం, పార్టీకి ఒకే టైం లో వచ్చారట. విచిత్రమేంటంటే, అక్కడ అందరూ అనుకున్నట్లు ఇద్దరూ అటూ ఇటూ పోకుండా, కలిసి కూర్చుని చాలాసేపు మాట్లాడుకున్నారట. పార్టీలో రణ్ బీర్ వెళ్లేంతవరకూ ఉన్న కత్రినా, రణ్ బీర్ వెళ్లిన తర్వాతే వెళ్లిందట. దీంతో ఇద్దరికీ మళ్లీ ప్యాచ్ అప్ అవుతోందని బాలీవుడ్ వర్గాలు కిసుక్కుమంటున్నాయి. దీపికాతో బ్రేకప్ తర్వాత కత్రినాతో ప్రేమలో పడిన రణ్ బీర్, ఆ తర్వాత ఇంకెవరినీ తగులుకోలేదు. కత్రినా పై ఇంకా ప్రేమ ఉండటమే అందుక్కారణమని ముంబై సినీ వర్గాలు చెబుతున్నాయి. దీని బట్టి చూస్తే త్వరలోనే మళ్లీ ఈ ప్రేమ పావురాలు ఒక్కటవుతున్నాయన్నమాట..