English | Telugu
ప్రత్యూష ఆత్మహత్యపై డ్రీమ్ గర్ల్ కాంట్రవర్సీ కామెంట్స్..!
Updated : Apr 5, 2016
ప్రత్యూష బెనర్జీ ఆత్మహత్యపై బాలీవుడ్ ప్రముఖులంతా సంతాపం ప్రకటిస్తుంటే, అలనాటి డ్రీమ్ గర్ల్ హేమమాలిని మాత్రం వివాదాస్పద ట్వీట్స్ చేశారు. ఆమె ట్వీట్స్ కు, నెటిజన్లందరూ ఆమెపై మండిపడుతున్నారు. కష్టాలను ఎదుర్కొని సక్సెస్ ఫుల్ గా మనిషి పైకిరావాలి తప్ప, ఒత్తిడికి తలొగ్గి ఓడిపోకూడదు. ప్రపంచం గెలిచేవాడినే మెచ్చుకుంటుంది తప్ప పిరికివాళ్లను కాదు. ఈ సెన్స్ లెస్ సూసైడ్స్ వల్ల ఏమీ సాధించలేరు. జీవితం దేవుడిచ్చిన బహుమతి. దాన్ని తీసే హక్కు ఎవరికీ లేదు. అంటూ ఆమె ట్వీట్స్ చేశారు. హేమ ఉద్దేశం మంచిదే అయినప్పటికీ, ఆమె చెప్పిన విధానం, చాలామంది నెటిజన్లకు మంటెక్కిస్తోంది. చనిపోయిన వారి మీద చేసే కామెంట్స్ మిమ్మల్ని గొప్పవాళ్లను చెయ్యవు అని ఒకరు, కొంతమంది జీవితంలో అనుభవించే కష్టాలకు, వాళ్లు బ్రతికుండటమే పెద్ద సాహసం కింద లెక్క అంటూ మరొకరు, ఇలా చాలామంది ట్విటిజన్లు హేమమాలిని వైఖరిని గట్టిగానే విమర్శించారు. హేమమాలిని చేసిన ట్వీట్ ప్రత్యూషను లూజర్ అంటూ తిడుతున్నట్టుగా ఉండటమే ఈ విమర్శల వెనుక కారణం. తన ట్వీట్స్ పై హేమ ఇంకా ఏ వివరణ ఇస్తారన్నది ఆసక్తికరంగా మారింది.