English | Telugu

'సరైనోడు' కు సరైన సెల్ఫీ అంటే ఇదే

అల్లు అర్జున్ సరైనోడు మొదలైనప్పటి నుంచి సినిమా మీద మంచి అంచనాలే ఉన్నాయి. బోయపాటి లాంటి మాస్ డైరెక్టర్ చేతిలో బన్నీ సినిమా ఎలా ఉంటుందోనన్న డౌట్స్ ను క్లియర్ చేస్తూ, టీజర్లో తన మార్క్ ను స్పష్టంగా చూపించేశారు బోయపాటి. మాస్, ఊర మాస్ అంటూ బన్నీ చెప్పిన డైలాగ్ ఆయన ఫ్యాన్స్ ను ఉర్రూతలూగించింది. ఆ దెబ్బతో సరైనోడు బిజినెస్ కూడా భారీగానే జరిగిపోయింది. మూవీ టీం ఎప్పటికప్పుడు సరైనోడు ఎక్కడ ఎలా జరుగుతుందో సెల్ఫీల రూపంలో చూపిస్తూనే ఉన్నారు.

లెటెస్ట్ గా హీరో అల్లు అర్జున్, మరో హీరో శ్రీకాంత్, విలన్ గా చేస్తున్న ఆది పినిశెట్టిలు ముగ్గురూ కలిసి సెల్ఫీ తీసుకున్నారు. సినిమాలో ఈ ముగ్గురివీ చాలా ఇంపార్టెంట్ రోల్స్. సో, ముగ్గురు హీరోల ముచ్చటైన సెల్ఫీ, సరైనోడికి ఇదే సరైన సెల్ఫీ అంటూ బన్నీ ఫ్యాన్స్ అనుకుంటున్నారు. సరైనోడు టీం త్వరలోనే ఆడియో రిలీజ్ చేసుకోబోతుంది. వైజాగ్ లో జరగబోతోందంటూ వార్తలు వచ్చినా, అవి నిజం కాదని తెలుస్తోంది. వెన్యూ ఎక్కడ అనేది త్వరలోనే మూవీ టీం ప్రకటించే అవకాశం ఉంది.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.