English | Telugu
సర్దార్ ఆడియో ఫంక్షన్లో ఫ్యాన్స్ కు ఏం కావాలి..?
Updated : Mar 19, 2016
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఈ పేరు ఏ ఆడియో పంక్షన్లో అయినా ఎవరైనా పొరపాటున అంటే చాలు, హాలంతా దద్దరిల్లిపోతుంటుంది. దాదాపు ప్రతీ హీరోకీ, వాళ్ల ఆడియో ఫంక్షన్లో పవన్ ఫ్యాన్స్ స్ట్రోక్ తగులుతూనే ఉంది. మరి డైరెక్ట్ గా పవనే వస్తున్న సర్దార్ ఆడియో ఫంక్షన్లో పవన్ ఫ్యాన్స్ ను ఆపగలరా..పట్టుకోగలరా ? ఈ ప్రశ్నలకు లేదనే సమాధానం వస్తుంది. అసలింతకీ, పవన్ ఫ్యాన్స్ కు ఎందుకు ఆయనంటే అంత క్రేజ్. సర్దార్ ఆడియో ఫంక్షన్లో పవన్ నుంచి ఫ్యాన్స్ ఏం కోరుకుంటున్నారు..?
స్మైల్
పవన్ నుంచి ఫ్యాన్స్ కోరుకునేది ఫస్ట్ అండ్ ఫస్ట్ ఆయన స్మైల్. దేవుడూ అంటూ వెనకాల వరస ఆడియన్స్ నుంచి అరుపు వినబడగానే పవన్ ఇచ్చే స్మైల్. అది చాలు ఆ రోజు ఆయన ఫ్యాన్స్ కడుపు నిండిపోవడానికి..
డైలాగ్
పవన్ కు సిగ్గెక్కువ. జనరల్ గా డైలాగులు చెప్పరు. కానీ చెప్తే వినాలని మాత్రం ఆయన ఫ్యాన్స్ ఒళ్లంతా చెవులు చేసుకుని చూస్తుంటారు. ఒక్క డైలాగ్ చాలు, జనానికి పూనకాలు వచ్చేయడానికి..
ఎమోషన్
పవన్ తన స్పీచ్ మొదలుపెట్టే వరకూ చాలా ఇబ్బంది పడతారు. కానీ ఒక్కసారి స్పీచ్ మొదలైందంటే, ఇక ఆ తర్వాత అది గంగా ప్రవాహమే. ఆ స్పీడ్ లో ఆయన ఏమోషన్స్ ను చూడటానికి ఫ్యాన్స్ కు రెండు కళ్లూ సరిపోవు.
ఫోక్ సాంగ్
పవన్ లైవ్ లో ఫోక్ సాంగ్ పాడితే..? ఇది ఎప్పుడూ జరగలేదు. కానీ జరిగితే బాగుండునని ఆయన ఫ్యాన్స్ చాలా ఆశగా చూస్తుంటారు. సినిమాల్లో ఫోక్ బీట్స్ ను చించి ఆరేసే పవన్, ఆడియో ఫంక్షన్లో కూడా ఒకసారి పాడితే చూడాలని ఫ్యాన్స్ కోరిక
ఆలీతో రిలేషన్
పవన్ ఆలీల మధ్య బ్రొమాన్స్(రొమాన్స్ ఆఫ్ బ్రదర్స్). అన్నదమ్ముల్లా ఉంటే వీళ్లిద్దరూ ఒకరి గురించి ఒకరు చెబుతుంటే, రోజంతా వింటూనే ఉంటారు ఫ్యాన్స్. పవన్ గురించి ఆలీకి తెలిసినంతగా ఇండస్ట్రీలో మరెవరికీ తెలియకపోవచ్చు. అలాగే పవన్ కు కూడా ఆలీ మీద చాలా స్పెషల్ ఎఫెక్షన్ ఉంటుంది.
లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్
" సర్దార్ గబ్బర్ సింగ్ మీకే అంకితం. మీరే నా ప్రాణం. మీ కోసమే నా సినిమా.." ఈ లైన్స్ పవన్ చెబితే, ఆడిటోరియం బీటలు తీయడం కన్ఫామ్..
గమనిక : ఆయన ఏమీ మాట్లాడకుండా స్టేజ్ పై మౌనంగా నిల్చున్నా చాలు అనుకుంటారు సెపరేట్ సెక్షన్ ఆప్ ఫ్యాన్స్. వాళ్లు ఫ్యాన్స్ కాదు. పవన్ భక్తులు.