English | Telugu
పోర్న్ స్టార్ పై మనసు పడ్డ షారుఖ్ ఖాన్
Updated : Mar 19, 2016
బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ మనసు ఒక మాజీ పోర్న్ స్టార్ పై పడింది. సినిమా కోసమే లెండి. గ్యాంగ్ స్టర్ కథా నేపథ్యంలో షారుఖ్ రాయీస్ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కథానుసారం ఐటెం సాంగ్ కావాలి. దీనికి బాగా ఫ్యామస్ అయిన స్టార్ అయితే బెస్ట్ అని షారుఖ్ కు అనిపించిందట. వెంటనే సన్నీ లియోన్ ను ఆ పాటకు ఫిక్స్ చేసేశాడు. షారుఖ్ తో కలిసి డ్యాన్స్ చేసే ఛాన్స్ వచ్చినందుకు సన్నీ కూడా ఎగిరిగంతేసిందట.
రయీస్ మైలేజ్ కు సన్నీ ప్లస్ అవుతుందని షారుఖ్ భావిస్తున్నాడు. ఒకప్పుడు పోర్న్ స్టార్ గా జీవితాన్ని గడిపినా, దాన్నంతా గతంలోనే వదిలేసి బాలీవుడ్ లో తనకంటూ మంచి స్థానాన్ని సంపాదించుకుంటోంది సన్నీ. రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో, విలేకరి ఎంత ఇబ్బంది పెట్టినా, నవ్వుతూ ఆత్మవిశ్వాసంతో ఆమె జవాబులిచ్చిన విధానం చూసి, బాలీవుడ్ స్టార్స్ చాలామంది ఆమె వ్యక్తిత్వానికి ఫ్యాన్స్ అయిపోయారు. అమీర్ కూడా కుదరితే సన్నీతో యాక్ట్ చేస్తానని ప్రకటించాడు. లేటెస్ట్ గా ఈ ఫ్యాన్స్ లిస్ట్ లోకి షారుఖ్ చేరినట్టున్నాడు మరి..