English | Telugu
సరైనోడు ట్రైలర్ టాక్ : ఊర మాస్..!
Updated : Apr 11, 2016
రొటీన్ కు భిన్నంగా, ఆడియోను రిలీజ్ చేసేసి ఆ తర్వాత సక్సెస్ మీట్ ను నిర్వహించారు సరైనోడు టీం. ఈ సందర్భంగా, మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. బోయపాటి మార్క్ కనబడుతూ, అల్లు అర్జున్ స్టైలిష్ నెస్ తో, ఫైట్స్ తో ట్రైలర్ ను నింపేశారు. ట్రైలర్ బట్టి చూస్తే సినిమా అంతా ఫైటింగ్సే ఉంటాయేమో అన్న ఫీలింగ్ రాకమానదు. ఎంత మాస్ డైరెక్టరైతే మాత్రం, మొత్తం ఫైటింగ్స్, గన్స్, యాక్షన్ సీక్వెన్సెస్ మాత్రమే చూపిస్తే ఎలా అనే డౌట్ కూడా వస్తుంది.
" ఎదుటోడితో పెట్టుకోవాలంటే ఉండాల్సింది బ్రాండ్ కాదు. దమ్ము. టన్నులు టన్నులుందింకా..చూస్తావా ", " ఎనీ టైం, ఎనీవేర్, ఎనీ బడీ..నేను రెడీ..." ఈ రెండే ట్రైలర్లో వినిపించే డైలాగులు. ఇంకెవరి డైలాగులూ లేవు. సినిమా ఎలా ఉంటుంది అన్న ఐడియాను ముందే ఈ ట్రైలర్ ద్వారా అల్లు అండ్ కో ఇచ్చేశారు. విలన్ ను ఇసుకలో పడేసి బన్నీ నడుస్తుంటే, పక్కనే గుర్రం జంప్ చేసే లాస్ట్ షాట్ ట్రైలర్ కు హైలెట్. మొత్తం అన్ని షాట్లూ స్లో మోషన్లోనే కనిపిస్తాయి. ఓవరాల్ గా, ఫస్ట్ రిలీజైన టీజర్లో బన్నీ చెప్పిందే రైటు. ఈ సినిమా అతని గత సినిమాల్లాగా లేదు. పూర్తి సీరియస్ క్యారెక్టర్ తో ఫుల్ లెంగ్త్ మాస్ యాక్షన్ హీరోగా బన్నీ కనిపించబోతున్నాడని అర్ధమవుతోంది. ట్రైలర్ గ్యారంటీగా ఊర మాసే..!