English | Telugu
సర్దార్ గబ్బర్ సింగ్ ను చంపేసిన చిన్న పిల్లాడిని చూడండి..!
Updated : Apr 11, 2016
సర్దార్ గబ్బర్ సింగ్ దేశవ్యాప్తంగా రిలీజైంది. డివైడ్ టాక్ ఉన్నా, ఇప్పటి వరకైతే కలెక్షన్ల పరంగా బాగానే ఉంది. కానీ హిందీలో మాత్రం సర్దార్ పరిస్థితి ఘోరంగా ఉంది. పబ్లిసిటీ కూడా సరిగ్గా లేకపోవడంతో సినిమాకు ఓపెనింగ్స్ లేవు. సర్దార్ తో పాటు రిలీజైన జంగిల్ బుక్ బాగుండటంతో, సర్దార్ హాల్స్ లో కూడా జంగిల్ బుక్ ను బుక్ చేసేస్తున్నారు. దీంతో బాలీవుడ్ లో పవన్ సినిమా పరిస్థితి మరీ దారుణంగా తయారైంది.
మరో వైపు ఎప్పటికప్పుడు పవన్ పై కామెంట్స్ చేయడానికి రెడీ గా ఉండే రాంగోపాల్ వర్మ, మళ్లీ తనదైన శైలిలో సర్దార్ పై సెటైర్లు వేయడం మొదలెట్టారు. సర్దార్ గబ్బర్ సింగ్ ను, రాజా సర్దార్ గబ్బర్ సింగ్ ను చంపేసిన చిన్నపిల్లాడిని చూడండి అంటూ జంగిల్ బుక్ లో మోగ్లీ క్యారెక్టర్ వేసిన పిల్లాడి ఫోటో పెట్టారు వర్మ గారు. అంతేకాదు. పవన్ ఇకనైనా నిద్రలేవాలని, ఆయన్ను నిద్రలేపాల్సిన బాధ్యత పవన్ ఫ్యాన్స్ దేనంటూ ట్వీటారు. మరో వైపు తనమీద వర్మ ఎలాంటి వ్యాఖ్యలు చేస్తున్నా పవన్ మాత్రం వర్మంటే తనకు ఇష్టం అని ఒక ఇంటర్వ్యూలో చెప్పడం విశేషం.