English | Telugu
సల్మాన్ పోటీ నుంచి తప్పుకున్న షారుఖ్ ఖాన్..!
Updated : Apr 11, 2016
బాలీవుడ్ లో ఖాన్ లదే రాజ్యం. వారిలో కూడా షారుఖ్, సల్మాన్ ల మధ్య పోటీ ఎక్కువగానే ఉంటుంది. వీళ్లిద్దరి సినిమాలు వస్తున్నాయంటే, మిగిలిన హీరోలకు దడే. షారుఖ్ రయీస్, సల్మాన్ సుల్తాన్ సినిమాలు రెండూ ఈద్ పండగకు రావాలని ఫిక్స్ అయ్యాయి. జూలై 6 డేట్ నే రెండు సినిమాలూ లాక్ చేసుకున్నాయి. ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు ఒకేసారి రావడం అంత మంచిది కాదనే అభిప్రాయంలో బాలీవుడ్ పెద్దలు ఈ సినిమాల ప్రొడ్యూసర్లతో మాట్లాడటంతో, పోటీనుంచి షారుఖ్ రయీస్ తప్పుకుంది. సినిమా రిలీజ్ ను నిర్మాత రితేష్ సిధ్వానీ మరో రెండు వారాలు ముందుకు పోస్ట్ పోన్ చేశాడు. దీంతో బాలీవుడ్ బాక్సాఫీస్ కు దడ తగ్గింది. ఈద్ సల్మాన్ కు ప్రతీ ఏడాదీ కలిసొస్తున్న రోజు. సల్మాన్ సూపర్ హిట్ సినిమాలు చాలా వరకూ ఈద్ కే రిలీజయ్యాయి. అందుకే సల్మాన్ కోసం షారుఖ్ వెనక్కి తగ్గాడట. కానీ వెనక్కి తగ్గి సినిమా రిలీజ్ ను ముందుకు జరిపినా, హృతిక్ రోషన్ హైబడ్జెట్ మూవీ మొహంజదారో తో షారుఖ్ పోటీ పడే అవకాశం ఉంది. ఏదైమైనా ఈ వేసవి బాలీవుడ్ బాక్సాఫీస్ ను ఊరిస్తోంది. మరి క్యాష్ చేసుకునేదెవరో చూడాలి.