English | Telugu
రవితేజ "సారొస్తారు" ప్రారంభం
Updated : May 31, 2012
రవితేజ "సారొస్తారు" ప్రారంభం అయ్యింది. వివరాల్లోకి వెళితే వైజయంతీ మూవీస్ పతాకంపై, మాస్ మహరాజా రవితేజ హీరోగా, కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా, "యువత, సోలో" ఫేం పరశురామ్ (బుజ్జి) దర్శకత్వంలో, చలసాని అశ్వనీదత్ నిర్మిస్తున్న చిత్రం"సారొస్తారు". ఈ చిత్రం లాంఛనంగా ఆ సంస్థ కార్యాలంయంలో ఇదివరకే ప్రారంభమయ్యింది.ఈ చిత్రం జూన్ 16 నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. ఊటీలో ఈ చిత్రం షూటింగ్ మొదలవుతుంది.
ముందుగా ఈ చిత్రంలో త్రిష పేరు హీరోయిన్ గా వినిపించింది. కానీ కొన్ని కారణాల వల్ల ఆమె స్థానంలోకి కాజల్ వచ్చి చేరింది. ఇప్పటికే పూరీ జగన్నాథ్ దర్శకత్వంలోని "దేవుడు చేసిన మనుషులు" చిత్రం షూటింగ్ రవితేజ పూర్తిచేశాడు. అలాగే కాజల్ కూడా జూన్ 16 నుండి ఈ "సారొస్తారు" చిత్రంలో నటించేందుకు వీలుగా తన డేట్లను సర్దుబాటుచేసుకుందట.