English | Telugu
పవన్ కళ్యాణ్ ఊరిలో కూల్ డ్రింక్ ఫ్రీ
Updated : Apr 7, 2016
ప్రపంచమంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సర్దార్ గబ్బర్ సింగ్ రేపు థియేటర్లలో ల్యాండ్ అవుతున్నాడు. దీనిపై ఇటు పవన్ అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చాలా గ్యాప్‌తో తమ అభిమాన హీరో సినిమా వస్తుండటంతో ఫ్యాన్స్ హంగామా చేస్తున్నారు. మరి పవన్ సొంతూరు పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులో అయితే ఈ హంగామా ఒక రేంజ్‌లో ఉంది. సినిమాలు రిలీజ్ రోజున ఆ సినిమాలోని హీరో అభిమానులు తమ అభిమానానికి గుర్తుగా ఆ రోజు పండ్లు పంచడం, రక్తదానాలు చేయడం లేదంటే కటౌట్‌లోకి పాలాభిషేకాలు చేస్తుంటారు. అయితే ఈ విషయంలో అందరికంటే వెరైటీగా ఆలోచించారు మొగల్తూరు పవన్ ఫ్యాన్స్. సర్థార్ రిలీజ్ రోజున మొగల్తూరులోని థియేటర్లలో కూల్ డ్రింక్ ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించారు. అసలే ఎండాకాలం ఆపై సినిమా హీట్ ఆ వేడిని తగ్గించడానికే పవన్ ఫ్యాన్స్ కూల్‌డ్రింక్ ఇస్తున్నారన్నమాట.