English | Telugu
జూనియర్ ఎన్టీఆర్‌కు పోలీసులు ఫైన్..!
Updated : Apr 7, 2016
నిబంధనల విషయంలో పక్కగా వ్యవహరిస్తున్న హైదరాబాద్ పోలీసులు విధి నిర్వహణలో సామాన్యులైనా..సెలబ్రెటిలైనా ఎవరిని వదిలిపెట్టడం లేదు. తాజాగా ప్రముఖ సినీ హిరో జూనియర్ ఎన్టీఆర్‌కు ట్రాఫిక్ పోలీసులు ఫైన్ వేశారు. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటిస్తున్న జనతా గ్యారేజ్ సినిమా షూటింగ్ సారథి స్టూడియోలో జరుగుతోంది. దీనిలో పాల్గొనేందుకు నిన్న ఎన్టీఆర్ తన కారులో వెళ్తుండగా ట్రాఫిక్ పోలీసులు కారును ఆపారు.
ఎన్టీఆర్ డ్రైవర్ అన్ని ధ్రువపత్రాలను చూపించాడు. అయితే నిబంధనలకు విరుద్థంగా కారు అద్దాలకు బ్లాక్ ఫిల్మ్ ఉండటంతో రూ.700చలనా విధించారు. అయితే కారులో ఎన్టీఆర్ ఉన్నారని ఆయన్ని దించి వచ్చి చెల్లిస్తానని డ్రైవర్ చెప్పగా, అలా కుదరదని చలానా చెల్లించిన తర్వాతే వెళ్లాలని పోలీసులు స్పష్టం చేశారు. దీంతో ఎన్టీఆర్ ఇచ్చిన డబ్బులు తీసుకుని డ్రైవర్ చలానా చెల్లించి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. తాము ఎవ్వరికి పక్షపాతం చూపించబోమని విధి నిర్వహణే తమకు ముఖ్యమని పోలీసులు మరోసారి నిరూపించుకున్నారు. ఫైన్ కట్టి ఎన్టీఆర్ కూడా తను సాధారణ పౌరుడినే అని రుజువు చేశాడు.