English | Telugu
హృతిక్ కోసం బరిలోకి దిగుతున్న ఎన్టీఆర్
Updated : Apr 7, 2016
ఎన్టీఆర్... ఓ ఆల్ రౌండర్. డైలాగులు అద్భుతంగా చెబుతాడు. డాన్సులు అదరగొడతాడు. యాక్టింగ్ స్కిల్స్ గురించి ఇక చెప్పక్కర్లెద్దు. అంతేనా..?? పాటలూ పాడేస్తుంటాడు. ఓ ప్రొఫెషనల్ సింగర్‌ని తలపిస్తూ.. తన గాత్రంతో మెస్మరైజ్ చేసేస్తుంటాడు. ఎన్టీఆర్ పాడిన పాటలన్నీ హిట్టే. కన్నడ లో పునీత్ రాజ్ కుమార్ కోసం ఓ పాట పాడాడు. ఆ పాట.. కన్నడలో మార్మోగిపోతోంది. ఇప్పుడు హృతిక్ రోషన్ కోసం కూడా ఎన్టీఆర్ బరిలోకి దిగబోతున్నట్టు టాక్. అవును.. త్వరలోనే ఎన్టీఆర్ ఓ హిందీ పాట పాడబోతున్నాడట. అదీ.. హృతిక్ కోసం.
హృతిక్ రోషన్‌కీ ఎన్టీఆర్‌కీ మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. ఎన్టీఆర్ డాన్సింగ్ స్కిల్స్ గురించి ఓ సారి ట్విట్టర్లో పొగిడేశాడు హృతిక్. నాన్నకు ప్రేమతో సినిమా గురించీ ప్రత్యేకంగా ప్రస్తావించాడు. ఎన్టీఆర్‌తో ఇప్పుడు ఓ పాట పాడించుకోవాలని చూస్తున్నాడు. హృతిక్ కోసం విశాల్ - శేఖర్ ద్వయం ఓ ప్రైవేట్ ఆల్బమ్ తయారు చేస్తున్నారు. అందులోని ఓ పాట ఎన్టీఆర్ తో పాడిస్తే బాగుంటుందన్నది హృతిక్ ఆలోచన. ఇదే విషయాన్ని హృతిక్ ఎన్టీఆర్‌కి చెప్పడం, తాను ఓకే చేయడం జరిగిపోయాయని తెలుస్తోంది. త్వరలోనే ఎన్టీఆర్ ముంబై వెళ్లి ఈ పాట పాడొస్తాడట. అలా.. ఎన్టీఆర్ సింగింగ్ టాలెంట్... బాలీవుడ్‌కీ తెలియబోతోందన్నమాట.