English | Telugu
పవన్ అభిమానులు బాధపడ్డ క్షణం
Updated : Apr 7, 2016
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు సినీ ప్రపంచం ఆసక్తిగా ఎదురు చూసిన సర్దార్ గబ్బర్ సింగ్ ధియేటర్లలో ల్యాండ్ అయ్యాడు. ప్రపంచవ్యాప్తంగా నిన్న అర్థరాత్రి నుంచే బెనిఫిట్ షోలు, ప్రీమియర్ షోలతో నిన్న రాత్రి నుంచే హిట్ పుట్టించాడు. అయితే పవన్ కళ్యాణ్ స్టామినాను ఎవరెస్ట్ రేంజ్‌లో చూపించిన గబ్బర్ సింగ్‌కు సీక్వెల్‌గా వస్తుండటంతో హై ఎక్స్‌పెక్టేషన్‌తో రావడంతో గబ్బర్ సింగ్‌ను మించిన మాస్ ఎలిమెంట్స్ ఉంటాయని అంతా భావించారు. కాని డైరెక్టర్ అభిమానుల అంచనాలను రీచ్ కాలేకపోయాడని అర్థమవుతోంది. గబ్బర్ సింగ్ సినిమాకే హైలెట్‌గా నిలిచిన పోలీస్ స్టేషన్ అంత్యాక్షరి సీన్‌ను యాజ్ టీజ్‌గా దీంచే ప్రయత్నం చేశాడు బాబీ. కాకపోతే అక్కడ రౌడీల చేత పవన్ స్టెప్పులెయిస్తే. ఇక్కడ మాత్రం పవర్ స్టారే స్టెప్పులేశాడు. ఈ సీన్ అంతగా పేల్లేదు. ఫస్టాఫ్ మరి బోరింగ్‌గా ఉండటంతో సెకండాఫ్‌లో అయినా పవన్ ఏదైనా మ్యాజిక్ చేస్తాడని సీట్లలోంచి కదల్లేదు ఫ్యాన్స్. కాని పవన్ కుప్పిగంతులు చూసిన అభిమానులకు ఎడుపు ఒక్కటే తక్కువ.