English | Telugu
పవర్ తగ్గిన పవన్ వన్ మ్యాన్ షో
Updated : Apr 7, 2016
సర్దార్ గబ్బర్‌సింగ్ కథ విషయంలో వవన్ ప్రయోగాలకు పోలేదు. కొత్తదనం జోలికి వెళ్లలేదు. ఫార్ములాకు తగ్గట్టుగానే కథని నడిపి.. తన అభిమానుల్ని అనుక్షణం సంతృప్తి పరచడానికి ప్రయత్నించాడు. పవన్ ఎనర్జీ, అతని క్యారెక్టరైజేషన్ సర్దార్ గబ్బర్‌సింగ్ కి వెన్నెముక. ఒక ముక్కలో చెప్పాలంటే ఇది పవన్ వన్ మ్యాన్ షో. పవన్ లేకపోతే ఈ సినిమా లేదు. ఈ సినిమా తొలి సన్నివేశం నుంచీ పవన్ మోటీవ్ అదే. పవన్ ఇంట్రడక్షన్ ఫైట్, అక్కడ చెప్పిన డైలాగులు, ఆ తరవాత వచ్చే పాట.. ఇవన్నీ అభిమానులకు నచ్చుతాయి. పవన్ కామెడీ టైమింగ్‌తో.. తన ఎనర్జీతో ఫస్టాఫ్ అంతా లాగించేశాడు. ఇంట్రవెల్ ముందొచ్చే...ఫైట్ అభిమానులకు పండగే. ఆడెవడన్నా.. ఈడెవడన్నా.. సర్దార్ అన్నకు ఎదురెవడన్నా.. అనే పాటతో.. ఓ ఫైట్ కంపోజ్ చేసి.. ఫస్టాఫ్‌కి గ్రాండ్ గా ముగింపు ఇచ్చాడు. సెకండాఫ్‌లో విలన్‌ని ఎదుర్కోవడం, హీరోయిన్‌ని దక్కించుకోవడం.. శుభం కార్డు పడిపోవడం.. ఇదంతా రొటీనే. అయితే.. మధ్యమధ్యలో వవన్ శైలి చమక్కులు, డైలాగులు, చిరంజీవి వీణ స్టెప్పు.. ఇవన్నీ కలగలిపి కాలక్షేపం అందిస్తాయి.