English | Telugu
పవన్ కళ్యాణ్ కి వందకి వంద మార్కులు
Updated : Apr 7, 2016
పవన్ ఎనర్జీ, అతని క్యారెక్టరైజేషన్ సర్దార్ గబ్బర్‌సింగ్ కి వెన్నెముక. ఒక ముక్కలో చెప్పాలంటే ఇది పవన్ వన్ మ్యాన్ షో. పవన్ లేకపోతే ఈ సినిమా లేదు. పవన్ ప్లేసులో మరొకరున్నా. ఈ సినిమా అంతంత మాత్రమే. పవన్ పాత్ర తప్ప.. రెండో పాత్రేదీ కంటికి కనిపించదు. ఏ పాత్రనీ బలంగా రాసుకోలేదు. కొన్ని సీన్లు పైపైన తేలిపోతుంటాయి. కథలో బలం లేకపోవడంతో ఆసక్తికరమైన మలుపులు కరువవ్వడంతో.. ఉత్కంఠతకు లోనుకాలేడు ప్రేక్షకుడు. కానీ.. ప్రతీ సీనులోనూ పవన్ కనిపించడం, యాక్షన్ దృశ్యాలు ఆకట్టుకోవడం.. పవన్ శైలి ఎంటర్‌టైన్‌మెంట్ దొరకడం ఈ సినిమాకి ప్లస్ పాయింట్లు. పవన్ ఈ సినిమాలో చాలా అందంగా కనిపించాడు. తన అభిమానుల్ని మెప్పించాలన్న కసితో కనిపించాడు. ఆ విషయంలో పవన్‌ని వందకి వంద మార్కులు పడతాయి. కాస్త ఇబ్బంది పడినా.. స్టెప్పులు వేయడానికి ప్రయత్నించాడు.