English | Telugu
సర్దార్ లో పంచ్ డైలాగ్స్ పేలబోతున్నాయి..!
Updated : Apr 7, 2016
డైలాగ్ చెప్పడంలో ఒక్కో హీరోది ఒక్కో స్టైల్ . మిగతా హీరోలకు భిన్నంగా ఢిఫరెంట్ మాడ్యులేషన్, డైలాగ్ డెలీవరితో డైలాగ్స్ పేల్చడంలో పవర్ స్టార్ దిట్ట. ఆయన సినిమా వస్తుందంటే చాలు కొత్తగా సినిమాలో ఎలా కనిపిస్తారో? ఎలాంటి డైలాగ్స్ వినిపిస్తారోనని ఫ్యాన్స్ ఎదురు చూస్తుంటారు. అలా గబ్బర్ సింగ్ సినిమాలో "సాంబ...రాస్కోరా" అంటూ పవన్ పేల్చిన పంచ్, అత్తారింటికి దారేదిలో " చూడప్పా సిద్ధప్పా, నేను సింహం లాంటొడినబ్బా" అంటూ పేల్చిన పంచ్ తెలుగు నాట సెన్షేషన్ క్రియేట్ చేసింది. అభిమానులను అంతగా అలరించిన డైలాగ్స్ మళ్లీ ఈ మధ్య కాలంలో రాలేదు. తాజాగా గబ్బర్ సింగ్ సీక్వెల్‌గా వస్తున్న సర్దార్ గబ్బర్ సింగ్‌లో ఎలాంటి పంచ్ డైలాగ్స్ ఉన్నాయో అన్న క్యూరియాసిటిలో ఉన్నారు పవన్ ఫ్యాన్స్. అందుకు తగ్గట్టే లేటేస్ట్‌గా రిలీజైన ట్రైలర్స్‌లో పవన్ పేల్చిన పంచ్‌లకు ఫ్యాన్స్ ఫిదా అవతున్నారు.
ఆ పంచ్ డైలాగ్స్ మీకోసం :
ఆయన డబ్బుకు, భయానికి లొంగడు..ఆయనకి మీరు వోన్ అవ్వాలంటే..ముందు ట్యూన్ అవ్వాలి, లేకపోతే ఫ్యాన్ అవ్వాలి
చిన్నప్పటి నుంచి ముద్ద పెట్టేవాళ్లు గానీ, ముద్దులు పెట్టేవాళ్లు లేక కరువాసిపోయాను
పొగరెక్కి తల ఎగరేసే నీలోంటోడు పుట్టిన ప్రతిసారి..తెగ నరకడానికి నాలాంటోడు పుడుతూనే ఉంటాడు.
ఒక్కడినే, ఒక్కడినే. ఎక్కడికైనా ఇలాగే వస్తే..ఇలాగే ఉంటా, జనంలో ఉంటా..జనంలా ఉంటా..