English | Telugu
పవన్ కళ్యాణ్ దేవుడంటున్న శ్రీజ..!
Updated : Apr 7, 2016
పవన్ కళ్యాణ్ దేవుడంటూ వ్యాఖ్యనించింది శ్రీజ. శ్రీజ అంటే చిరంజీవి చిన్న కూతురు కాదు. క్యాన్సర్ మహమ్మారి బారిన పడి మృత్యువుతో పోరాడుతూ పవన్‌ను చూడాలనుకున్న శ్రీజ. పవన్ ఆమెను చూడటానికి వెళ్లాడు కూడా. ఇప్పుడు ఆ అమ్మాయి క్యాన్సర్ నుంచి పూర్తిగా బయటపడి తిరిగి మామూలు మనిషైంది. ఈ సందర్భంగా ఆ అమ్మాయి మీడియా ముందుకు వచ్చి వపన్ అందించిన సాయాన్ని మరచిపోనని ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటానని చెప్పింది. కష్టకాలంలో ఆదుకుని తమకు ధైర్యాన్నిచ్చారని, నా కోసం ఖమ్మం వచ్చి పరామర్శించారని తర్వాత కూడా ఇంటికి పిలిపించుకుని ఆరోగ్యపరిస్థితి గురించి తెలుసుకున్నారని శ్రీజ ఉద్వేగంతో చెప్పింది. తన అభిమానులకోసం పవన్ చాలా ఆలోచిస్తారని సినిమా ఇండస్ట్రీలో అంటుంటారు. ఇలాంటి సంఘటనలు చూసినప్పుడు అది నిజమని అర్ధమవుతుంటుంది.