English | Telugu
ఈరోజే కాంట్రవర్సీ కింగ్ పుట్టిన రోజు..!
Updated : Apr 7, 2016
ఆ పేరు ఒక కాంట్రవర్సీ. ఆ పేరు ఒక సెన్సేషన్. ఆ పేరుకు ఎంతో మంది శత్రువులు. అదే పేరుకు ఎంతో మంది వీరాభిమానులు. ది నేమ్ ఈజ్ వర్మ. రామ్ గోపాల్ వర్మ. సినిమాలతో సెన్సేషన్ క్రియేట్ చేసినా, పిచ్చి ట్వీట్స్ తో కాంట్రవర్సీ క్రియేట్ చేసినా వర్మ స్టైలే డిఫరెంట్. పబ్లిసిటీ స్టంట్స్ ఈయనకు తెలిసినట్టు ఎవరికీ తెలీదు. శివ లాంటి ట్రెండ్ సెట్టర్ తీసినా, ఆగ్ లాంటి పరమ చెత్త సినిమా తీసినా ఆయన ఫాలోయింగ్ మాత్రం తగ్గదు. ఈరోజు వర్మ గారి బర్త్ డే. ఈ సందర్భంగా ఈ కాంట్రవర్ముడి కెరీర్లో జస్ట్ కొన్ని బెస్ట్ మూవీస్ పై ఓ లుక్కేద్దాం చలో..!
1. శివ
పాత్ బ్రేకింగ్, ట్రెండ్ సెట్టింగ్, సైకిల్ చైన్ లాగింగ్..అంతే
2. మనీ
వర్మలో కామెడీ యాంగిల్ కూడా ఉందండోయ్..!
3. రంగీలా
రంగీలాను హిట్ చేసి, వర్మ సినిమాలకు బాలీవుడ్ బుక్కైపోయింది. ఆ తర్వాతే పాపం హిందీ వాళ్లపై వర్మ దండయాత్ర మొదలైంది..!
4. దెయ్యం
వర్మ భయపెట్టడానికి ట్రై చేసిన మొదటి సినిమా. చాలా మంది సినిమాకు రెండో పార్ట్ వస్తుందని ఇంకా ఎదురుచూస్తున్నారు పాపం..!
5. అనగనగా ఒక రోజు
వర్మలోని రొమాంటిక్ యాంగిల్, థ్రిల్లింగ్ థింకింగ్ ను చూపించిన సినిమా..!
6. సత్య
బాలీవుడ్ అండర్ గ్రౌండ్ సినిమా జానర్లో వర్మ బెస్ట్ లో ఒకటి..!
7. సర్కార్
వర్మ ఫేవరెట్ మూవీ గాడ్ ఫాదర్ కు ఇండియన్ వెర్షన్...!
8. రక్త చరిత్ర
టాలీవుడ్ లో వర్మను సేవ్ చేసిన సినిమా..!
అదండీ సినిమాల్లో వర్మ గారి దండయాత్ర. మరి తన చివరి తెలుగు సినిమా వంగవీటి అని ఎనౌన్స్ చేసిన వర్మ ఆ మాట మీద నిలబడతారా..? అలా నిలబడితే, ఆయన ఫ్యాన్స్ ఊరుకుంటారా..? ఎనీహౌ వర్మ గారికి హ్యాపీ బర్త్ డే. ఆయన మరిన్ని సినిమాలు (అటాక్ లాంటివి కాకుండా) తీసి మనల్ని అలరించాలని కోరుకుందాం.