English | Telugu
సర్దార్ ప్రభంజనం ఖాయం.. ఎందుకంటే..?
Updated : Apr 5, 2016
బాహుబలి తరవాత ఆ రేంజు హైప్ తెచ్చుకొన్న చిత్రం.. సర్దార్ గబ్బర్‌సింగ్. బహుశా గత కొన్నేళ్లుగా పవన్ కల్యాణ్ చేసిన ఏ సినిమాకీ ఇంత హైప్ రాలేదు. ప్రీ బిజినెస్సే దాదాపుగా రూ.95 కోట్లు జరగడం.. సర్దార్ క్రేజ్‌కి పెద్ద నిదర్శనం. కథ, స్ర్కీన్‌ప్లే స్వయంగా పవన్ అందించడం, ఈ సినిమాకి సంబంధించిన సమస్త వ్యవహారాల్నీ పవన్ ఒక్కడే ముందుండి నడిపించడంతో ఇది 100 % పవన్ సినిమా అనే ఫీలింగ్‌లో పడిపోయారు పవన్ ఫ్యాన్స్. కాబట్టి ఈ సినిమాలోని ప్రతీ మూమెంట్‌ని వాళ్లు ఎంజాయ్ చేయగలరు. ఇటీవలే సర్దార్ సెన్సార్ కూడా పూర్తయ్యింది. సెన్సార్ సభ్యుల రిపోర్ట్‌ని బట్టి, సర్దార్ సినిమాకి పనిచేసిన సాంకేతిక బృందం అందించిన సమాచారాన్ని బట్టి.. సర్దార్‌ని ముందుండి నడిపించే ప్లస్ పాయింట్స్ ఇవే!
* సర్దార్ ని పూర్తిగా ఎంటర్‌టైన్‌మెంట్‌తోనే నడిపించాడు పవన్ కల్యాణ్. ఆఖరికి ఫైట్ సీక్వెన్స్‌లో కూడా పవన్ స్టైల్ ఆఫ్ ఫన్.. జోడించారని తెలుస్తోంది.
* గబ్బర్ సింగ్‌కి హైలెట్.. అంత్యాక్షరి ఎపిసోడ్. అలాంటిదే ఈ సినిమలోనూ ఓ ఎపిసోడ్ ఉంది. అయితే అంత్యాక్షరిలో రౌడీ గ్యాంగ్ పాటలు పాడుతుంది. ఇక్కడ మాత్రం తమ అభిమాన కథానాయకుల్ని అనుకరిస్తూ స్టెప్పులు వేస్తారు. ఆ ఎపిసోడ్‌లోనే పవన్ కల్యాణ్ కూడా వీణ స్టెప్ప్ వేశాడట. ఈ ఎపిసోడ్ మొత్తంహిలేరియస్‌గా సాగుతుందని, కొంతమంది టాప్ హీరోలపై ఇదో సెటైర్ అని తెలుస్తోంది.
* యాక్షన్ ఎపిసోడ్స్‌ని బాలీవుడ్ స్థాయిలో తెరకెక్కించారట. వాటిని పవన్ స్వయంగా డిజైన్ చేశాడట. రామ్ లక్ష్మణ్ పవన్ ఆలోచనలకు అనుగుణంగా ఫైట్స్‌ని కంపోజ్ చేశారని తెలుస్తోంది. ఇంట్రడక్షన్ ఫైట్, ఇంట్రవెల్ బ్యాంగ్ ముందు వచ్చే ఫైట్స్ సినిమా మొత్తానికి హైలెట్ గా నిలవనున్నాయి. ఇంట్రవెల్ ఫైట్లో వంద గుర్రాలూ, పాత కార్లు, వందమంది ఫైటర్లు, వేయి మంది జూనియర్ ఆర్టిస్టులూ కనిపిస్తారు. ఈ ఫైట్ కోసమే కోటి రూపాయలు ఖర్చయ్యాని తెలుస్తోంది. అతి సూక్ష్మమైన కెమెరాల్ని వాడి.. ఫైట్ సీన్‌ని సరికొత్త యాంగిల్‌లో ప్రజెంట్ చేశారని తెలుస్తోంది.
* ఇంట్రవెల్ వరకూ సరదాగా సాగిపోయే సినిమా... ఇంట్రవెల్ నుంచి సీరియస్ మూడ్‌లో సాగుతుందట. కాజల్ - పవన్ మద్య నడిపించిన లవ్ ట్రాక్ సరికొత్త గా ఉందని తెలుస్తోంది.
* పవన్ విసిరే కొన్ని పొలిటికల్ పంచ్‌లు.. రాజకీయ వర్గాల్లోనూ సంచలనంగా మారబోతున్నాయని టాక్.
* కాపు వర్గాన్ని వెనకేసుకొస్తూ.. పవన్ కొన్ని డైలాగులు పలికాడట.
* చిరంజీవిని గుర్తు చేసేలా ఓ సీన్ ఉందని.. మెగా అభిమానుల్ని అది తప్పకుండా సంతోష పెడుతుందని తెలుస్తోంది.
* చాలాకాలం తరవాత. పవన్ ఈ సినిమాల స్టెప్పులు వేయడానికి ప్రయత్నించాడట. సింపుల్‌గా ఉన్నా.. ఆ స్టెప్పులు సూపర్బ్‌గా అనిపిస్తాయని చిత్రబృందం తెలిపింది.
* ఇవీ సర్దార్‌లోని హైలెట్స్.. నిజంగా ఈ ప్లస్ పాయింట్స్ అన్నీ క్లిక్కయితే... సర్దార్ వసూళ్ల ప్రభంజనం సృష్టించడం ఖాయం.