English | Telugu

ఎన్టీఆర్‌ను అందుకోవడం అసాధ్యం-పవన్ కళ్యాణ్

తెలుగు సినిమాను శాసించే కొణిదెల-నందమూరి కుటుంబాల మధ్య ఎప్పుడూ ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతుండేది. నటనలో కాని రికార్డుల్లో కానీ ఒకరితో ఒకరు ఢీకొడుతూ ఉండేవారు. ఎన్టీఆర్-చిరంజీవి, చిరంజీవి-బాలకృష్ణ ఇలా తరాలుగా ఇరు కుటుంబాల వారసులు ఒకరిపై ఒకరు పైచేయి సాధించేందుకు శ్రమిస్తూ ఉండేవారు. అయితే ఇదంతా సినిమాల పరంగా మాత్రమే. బయట మాత్రం ఇరు కుటుంబాలు చాలా సన్నిహితంగా మెలుగుతాయి. ఒకరి ఇంట్లో శుభాకార్యాలకు ఒకరు హాజరువుతూ సినిమాలు వేరు స్నేహం వేరు అంటూ నిరూపించారు. తెలుగు సినిమాలో శిఖర సమానుడైన ఎన్టీఆర్‌కు సామాన్యుల నుంచి ప్రముఖుల దాకా వీరాభిమానులున్నారు. వారిలో మెగా ఫ్యామిలీ కూడా ఒకటి.

చిరంజీవికి అన్న నందమూరి తారక రాముడంటే ఎనలేని భక్తి, గౌరవం. ఎన్నో సందర్భాల్లో ఎన్టీఆర్‌ను పోగిడేవారు చిరంజీవి. ప్రజారాజ్యం పార్టీ స్థాపన సమయంలోనూ తనకు రాజకీయాల్లో స్పూర్తి ఎన్టీఆరే అన్నారు. ఇప్పుడు అదే దారిలో తమ్ముడు పవన్ కళ్యాణ్ వచ్చి చేరారు. సర్దార్ గబ్బర్ సింగ్ మూవీని హిందీలో రిలీజ్ చేస్తుండటంతో పవన్ ఇంటర్వ్యూల కోసం బాలీవుడ్ మీడియా క్యూ కట్టింది. అప్పట్లో అనుపమకు ఇంటర్వ్యూ ఇచ్చినలో చాలా సంగతులు చెప్పుకొచ్చాడు. తనకు స్టార్ డం మీద మమకారం కానీ ఇష్టం కానీ లేవని వివరించాడు. పాటల్లో,డ్యాన్సుల్లో నటించడానికి ఇబ్బంది పడతానని చెప్పాడు. అన్నయ్య మెగాస్టార్‌కు తాను వీరాభిమానిని అని అయితే క్రేజ్ విషయంలో ఆయన్ను అందుకోవడం సాధ్యం కాదని చెప్పుకొచ్చాడు. యాక్టింగ్ విషయంలో ఎన్టీఆర్‌ను ఆందుకోవడం అసాధ్యం అన్నారు. యాక్టింగ్‌లో ఎన్టీఆర్‌కి సాటి కానీ క్రేజ్‌లో చిరంజీవికి పోటీ కాని ఉండదని ఇలా తన మనసులో మాట చెప్పారు పవర్ స్టార్.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .