English | Telugu

సర్దార్ ఫ్యాన్స్ కు గిఫ్ట్ రేపే వస్తోంది

పవన్ సర్దార్ పై ఉన్న అంచనాలు ట్రైలర్ రిలీజ్ ముందు వరకూ ఒకలా ఉంటే, రిలీజ్ తర్వాత మరోలా మారిపోయాయి. పవన్ ఫ్యాన్స్ అంతా భారీ అంచనాలతో, ఆడియో ఫంక్షన్ కోసం, ట్రైలర్ కోసం ఎదురుచూశారు. కానీ ట్రైలర్ చూసిన తర్వాత మాత్రం, ఫ్యాన్స్ కూడా పవన్ రేంజ్ ట్రైలర్ కాదని పెదవి విరిచేశారు. దాంతో సర్దార్ టీంతో కలిసి పవన్ తన ఫ్యాన్స్ ను మరో గిఫ్ట్ ఇచ్చి శాటిస్ ఫై చేయడానికి రెడీ అయ్యాడు. సినిమాలోని బెస్ట్ సీన్స్, బెస్ట్ డైలాగ్స్ కలుపుకుని సరికొత్త ట్రైలర్ ను రేపు రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు మూవీ టీం. అందుకు పవన్ కూడా ఒప్పుకోవడమే కాక, ఈ ట్రైలర్ అద్భుతంగా ఉండాలని ఆర్డర్ పాస్ చేశారట. ఇప్పటికే ట్రైలర్ కటింగ్ అయిపోయి, తుది మెరుగులు దిద్దుతున్నారని సమాచారం. రేపు రిలీజయ్యే సినిమాల కంటే, పవన్ కొత్త ట్రైలర్ ఎలా ఉంటుందో అన్నదానిపైనే ఇప్పుడు పవన్ ఫ్యాన్స్ చూపులున్నాయి. ఈ ట్రైలర్ తోనైనా, తాము కాలర్ ఎగరేసుకోవచ్చనేది వాళ్ల ఆశ. మరి పవన్ వాటిని ఎంత వరకూ నెరవేరుస్తాడో తెలియాలంటే రేపటి వరకూ ఆగాల్సిందే..

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.