English | Telugu

అల్లు అర్జున్ ముద్దుకు ఫ్యాన్స్ దాసోహం

అల్లు అర్జున్ ఫేస్ బుక్ కు పిచ్చ ఫాలోయింగ్ ఉంది. ఇలా పోస్ట్ లు పెట్టాడో లేదో అలా లక్షల లైకులు వచ్చేస్తాయి. ఏకంగా కోటి మందికి పైగా ఫాలోవర్లు ఉన్న ఫేస్ బుక్ ఎకౌంట్ అల్లు వారబ్బాయిది. లేటెస్ట్ గా తన కొడుకు అల్లు అయాన్ కు, భార్యతో కలిసి ముద్దు పెడుతూ ఉన్న ఫోటోను బన్నీ తన ఫేస్ బుక్ లో షేర్ చేశాడు. పోస్ట్ చేసిన గంటకే ఆ ఫోటోకు లక్షన్నర లైకులు కుప్పలు తెప్పలుగా వచ్చిపడిపోయాయి. టాలీవుడ్, మల్లూవుడ్ లలో సూపర్ స్టార్ స్టేటస్ ఉన్న బన్నీకి ఈమాత్రం లైకులు రావడంలో ఆశ్చర్యం లేదులెండి.

ఇప్పటికే సరైనోడు టీజర్ తో అభిమానులతో పాటు సినీ జనాన్ని కూడా వెయిటింగ్ చేయిస్తున్న బన్నీ బాబు, ఇలాంటి చిన్న చిన్న గిఫ్ట్ లతో ఫ్యాన్స్ ను అలరిస్తున్నాడు. ప్రస్తుతం ఐదు లక్షల లైకులకు దగ్గర పడుతోందీ ఫోటో. ఇంతకీ ఈ ఫోటోలో వెనక డెకరేషన్ చూస్తే ఏమైనా అనిపిస్తోందా..? మీ గెస్ కరెక్టే. శ్రీజ పెళ్లి హడావిడిలో దిగిన ఫోటో ఇది. మరో పక్క, మా అయాన్ భలే ముద్దుగా ఉన్నాడంటూ మురిసిపోతున్నారు బన్నీ అభిమానులు. బన్నీ కంటే, స్నేహ పోలికలే అయాన్ లో ఎక్కువగా కనిపిస్తున్నాయి కదూ..మీరేమంటారు.?

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.