English | Telugu

రజనీ రోబో 2.0 లో ఫోటోలు లీకయ్యాయి

సూపర్ స్టార్ రజనీ బ్లాక్ బస్టర్ రోబో కు సీక్వెల్ గా వస్తోంది రోబో 2.0. శంకర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ విలన్ పాత్ర పోషిస్తున్నారు. లేటెస్ట్ గా అక్షయ్ విలనీ లుక్ ఎలా ఉండబోతోందన్న దాని గురించి హింట్ దొరికింది. రోబోలో బోరా అనే సైంటిస్ట్ విలన్ గా చేస్తే, ఈ పార్ట్ లో సైంటిస్ట్ గా అక్షయ్ చేస్తున్నాడు. ప్రస్తుతం అక్షయ్ కు సంబంధించి కీలక సన్నివేశాల్ని ఢిల్లీలో తెరకెక్కిస్తున్నారు. ఒక ప్రయోగం కారణంగా, తన రూపం కోల్పోయి, విచిత్రాకారాన్ని విలన్ సంతరించుకుంటాడని సమాచారం.

విచిత్రాకారంతో పాటే కొన్ని అసాధారణ శక్తులు కూడా అతనికి సొంతమవుతాయి. అతడిని చిట్టి సాయంతో, రజనీ ఎదుర్కొంటాడు. ఇదీ స్థూలంగా 2.0 కథ. స్టేడియంలో జనం మధ్య తీస్తుండటంతో, అక్షయ్ లుక్స్ బయటికి వచ్చేశాయి. వెనక్కి నొక్కి దువ్విన వైట్ హెయిర్, పెద్ద పెద్ద కనుబొమ్మలు, ఎర్రటి కనుగుడ్లతో, అక్షయ్ విలన్ లుక్ తో పెర్ఫక్ట్ గా సింక్ అయిపోయారు. ఇప్పటి వరకూ రోబో 2 కు సంబంధించిన ఒక్క విషయం కూడా బయటికి రాలేదు. ఇదే మొట్టమొదటి లీక్. ప్రస్తుతం అక్షయ్ కుమార్ గెటప్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. రజనీ లుక్స్ ను కూడా మరింత ఇంట్రస్టింగ్ గా శంకర్ ప్లాన్ చేస్తున్నాడని సమాచారం.

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.