English | Telugu

స‌ర్దార్ ట్రైల‌ర్‌.. అంత లేద‌క్కడ‌..!

హిందీలో ఊపేస్తుంది... ఊద‌ర‌గొట్టేస్తుంది, ఓ ఊపు తెస్తుంది... అనుకొని స‌ర్దార్ - గ‌బ్బ‌ర్ సింగ్‌ని హిందీలోనూ విడుద‌ల చేస్తున్నారు. బ‌హుశా బాహుబ‌లి ఇచ్చిన బూస్టింగ్‌తోనే స‌ర్దార్ టీమ్ ఈ నిర్ణ‌యం తీసుకొని ఉండొచ్చు. ఆ సినిమా బాలీవుడ్‌లో అనువాద రూపంలో వెళ్లి వంద కోట్లు కొల్ల‌కొట్టింది. క‌నీసం స‌ర్దార్‌కు ప‌ది కోట్ల‌యినా రాక‌పోతుందా? అన్న‌ది చిత్ర‌బృందం ఆలోచ‌న కావొచ్చు. టీజ‌ర్‌నీ, ట్రైల‌ర్‌ని తెలుగుతో పాటు హిందీలోనూ విడుద‌ల చేశారు. తీరా చూస్తే.. స‌ర్దార్ గ‌బ్బ‌ర్ సింగ్ హిందీ ట్రైట‌ర్ అట్ట‌ర్ ఫ్లాప్ అయ్యింద‌క్క‌డ‌.

స‌ర్దార్ హిందీ ట్రైలర్ విడుద‌లై మూడు రోజులైంది.. తీరా చూస్తే, 30 వేల హిట్స్ కూడా రాలేదు. అదే తెలుగు ట్రైలర్ అయితే దాదాపు ఆరు ల‌క్ష‌ల హిట్స్‌కి ద‌గ్గ‌ర ప‌డింది. తెలుగు ట్రైలర్ అంతంత మాత్ర‌మే అని ప‌వ‌న్ ఫ్యాన్స్ ఫీల‌వుతున్నా.. ఏదోలా చూసేస్తున్నారు. కానీ హిందీ వెర్ష‌న్ మాత్రం ఫ్లాప్ అయ్యింది. ఈ సినిమాని హిందీకి తీసుకెళ్ల‌డం అవ‌స‌ర‌మా? అని స‌గ‌టు ప‌వ‌న్ అభిమాని కూడా ప్ర‌శ్నించుకొంటున్నాడు. ఈ ఫ‌లితం వాళ్ల‌ని మ‌రింత నిరాశ కు గురి చేసేదే! ప‌వ‌న్ మ‌రో ప‌వ‌ర్ ఫుల్ ట్రైల‌ర్ వ‌దిలితే గానీ.. అటు అభిమానుల్లోనూ, ఇటు జ‌నాల్లోనూ కిక్ రాదు. అయితే అదైనా హిందీ ప్రేక్ష‌కుల మ‌న‌సు గెలుచుకొంటుంద‌న్న గ్యారెంటీ లేదు. హ‌త‌విధీ.. స‌ర్దార్ హిందీ వెర్ష‌న్‌ని ఎన్ని తిప్ప‌లొచ్చాయిరా నాయినా.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.