English | Telugu
బాలకృష్ణ సినిమాకి ఆస్కార్ వస్తుందా..?
Updated : Mar 23, 2016
నందమూరి బాలకృష్ణ నటించే 100 సినిమాపై అభిమానుల్లో బాగానే అంచనాలు ఉన్నాయి. ఇక బాలకృష్ణ కూడా తన 100 సినిమా గురించి ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. రోటీన్ సినిమాలకు భిన్నంగా ఉండాలని.. హిస్టారికల్ మూవీ చేయాలని డిసైడ్ అయ్యారు. కింగ్ గౌతమిపుత్ర శాతకర్ణి జీవితం ఆధారంగా బాలయ్య 100వ సినిమా ఉండబోతున్నట్టు తెలుస్తోంది. దీనిలో భాగంగానే బాలకృష్ణ కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పారు. తన మనవడి పుట్టినరోజు వేడుకలో పాల్గొన్న బాలయ్య స్టైలిష్ మీసంతో కనిపించారు. దీంతో అక్కడున్న వారందరూ.. ఈ మీసం మీ సినిమా కోసమేనా అడుగగా.. దానికి ఆయన అవును, ఈ మీసం పెంచేది 100వ సినిమా కోసమే, క్రిష్ దర్శకత్వం వహిస్తారు.. గౌతమిపుత్ర శాతకర్ణి జీవితం ఆధారంగా ఈ సినిమా ఉంటుందని వెల్లడించినట్లు సమాచారం. మరి బాలయ్య తీయబోయే ఈ హిస్టారికల్ మూవీ ఎలా ఉంటుందో తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే..