English | Telugu
నయనతారను ప్రిఫర్ చేస్తున్న రజనీ
Updated : Mar 15, 2016
నయనతార ఇప్పుడు సౌత్ లో మంచి డిమాండ్ ఉన్న హీరోయిన్. ఏజ్ పెరుగుతున్నా, నయన్ కు డిమాండ్ తగ్గట్లేదు. ఇంకా పెరుగుతూ వెళ్తోంది. సౌత్ లో అన్ని స్టేట్స్ లోని స్టార్ హీరోస్ సరసన యాక్ట్ చేసిన రికార్డు ఆమెది. సూపర్ స్టార్ రజనీతో ఇప్పటికే చంద్రముఖి, కథానాయకుడు సినిమాల్లో ఆయన సరసన నటించి, శివాజీలో స్పెషల్ సాంగ్ చేసిన నయన, ఇప్పుడు ఆయనతో ముచ్చటగా మరోసారి జతకట్టబోతోందని సమాచారం. రజనీ హీరోగా, మళయాళంలో సూపర్ హిట్టయిన భాస్కర్ ది రాస్కెల్ అనే సినిమాను తమిళంలో రజనీ రీమేక్ చేయబోతున్నారనే సంగతి తెలిసిందే. మళయాళంలో మమ్ముట్టి, నయనతార జంటగా నటించారు. సినిమాకు నయన క్యారెక్టర్ చాలా కీలకం. తమిళ్ లో కూడా అదే దర్శకుడు సినిమాను హ్యాండిల్ చేస్తుండటంతో, నయననే రజనీ సరసన తీసుకుందామని ఫిక్సయ్యారట. దీనికి రజనీ కూడా సై అన్నారని సమాచారం. కబాలీ పూర్తవ్వగానే, రోబో2 తో రజనీ బిజీ అవుతారు. ఆ తర్వాతే ఈ సినిమాను పట్టాలెక్కించబోతున్నారు. ఈ సినిమా సెట్స్ పైకి ఎప్పుడు వెళ్లబోతోందో చూడాలి.