English | Telugu
సర్దార్ గబ్బర్ సింగ్ కు సరికొత్త బాడీగార్డులు వచ్చారు
Updated : Mar 15, 2016
అదేంటి..పవన్ కు బాడీగార్డులెవరు అనుకుంటున్నారా..మరేం లేదండి. పవన్ మేనల్లుడు సాయి ధరమ్ తేజ తన తమ్ముడితో కలిసి సర్దార్ సెట్స్ కు వెళ్లాడు. అక్కడ గన్ లు తీసుకుని, కాసేపు పవన్ కు గన్ మేన్లలా ఇద్దరూ నడుస్తూ అందర్నీ నవ్వించారు. ఈ ఫోటోల్నే తన సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్ లో పెట్టాడు.
ఫోటోలు చూస్తే నిజంగా బాడీగార్డుల్లాగే ఇద్దరూ ఉన్నారు కదూ. ఎంతైనా మేనమామకు మేనల్లుళ్లు ఆమాత్రం సెక్యూరిటీ ఇవ్వడంలో తప్పులేదులే. సర్దార్ విషయానికొస్తే ఈ మూవీ హిందీలో కూడా రిలీజవ్వబోతోంది. కేవలం సౌత్ ఇండియానే కాక, నార్తలో కూడా పవన్ పాగా వేయాలనుకుంటున్నాడు. త్వరలోనే హిందీ ట్రైలర్ కూడా రిలీజ్ చేయబోతున్నారట. ఒక వేళ సర్దార్ నేషన్ వైడ్ హిట్ కొడితే మాత్రం, బాహుబలి రికార్డ్స్ డేంజర్లో పడినట్టే.