English | Telugu
చిరు కోసం ఆమె కంప్లీట్ డేట్స్ ఇచ్చేసిందట
Updated : Mar 15, 2016
చిరు 150 కోసం అభిమానులు చాలా ఆసక్తి ఎదురుచూస్తున్నారు. ఆయన కత్తి రీమేక్ చేస్తారనే విషయం కన్ఫామ్ అయిపోయింది. మరి హీరోయిన్ ఎవరు అన్నదానిపై కూడా గాసిప్స్ట్ బాగానే వచ్చాయి. తాజాగా చిరు కత్తికి హిరోయిన్ ఫిక్సయ్యింది. తన తోటి హీరోలు బాలయ్య, వెంకటేష్, నాగార్జునలతో యాక్ట్ చేసిన నయనకు చిరు ఓటేశారు. ముప్ఫై లు దాటేసినా, ఇంకా సూపర్ ఫాం లో ఉంది ఈ అమ్మడు. దీంతో యూనిట్ ఆమెను డేట్స్ అడగ్గానే, ఏమాత్రం కాదనకుండా ఇచ్చేసిందని సమాచారం. తన కూతురి పెళ్లి ఏర్పాట్లలో ఉన్న చిరు, మే నుంచి కత్తి ఏర్పాట్లలో నిమగ్నమవుతారు. ప్రస్తుతం బాబు బంగారంలో వెంకీతో బిజీగా ఉన్న నయన, ఆ టైం కి చిరుతో జాయిన్ అవనుంది. వీళ్లిద్దరి కాంబో ఎలా ఉంటుందో, లెట్స్ వెయిట్ అండ్ సీ..