English | Telugu
సర్దార్ గబ్బర్ సింగ్ టీజర్ రివ్యూ
Updated : Mar 17, 2016
సర్దార్ గబ్బర్ సింగ్ టీజర్ రిలీజైంది. ఎవరికి ఎలా ఉన్నా, పవన్ ఫ్యాన్స్ మాత్రం టీజర్ చూసి వెర్రెత్తిపోతున్నారు. ముఖ్యంగా పవన్ ఇంట్రో.టవల్ ఎగురుతుండగా ఫేస్ కనబడకుండా కేవలం గ్లాసెస్ మాత్రమే కనబడేలా ఒక షాట్ ఉంటుంది. ఆ ఒక్క షాట్ కోసమే మళ్లీ మళ్లీ టీజర్ చూస్తున్నవాళ్లున్నారు.ఒక్క డైలాగ్ కూడా లేకుండాటీజర్ ను వదిలి పవన్ స్టామినాను ప్రూవ్ చేశారు మూవీ టీం. గబ్బర్ సింగ్ లాగే, ఈ సినిమాలోకూడా, పవన్ కు బైక్, గుర్రం, జీప్ ఉంటాయట.
టీజర్లో బైక్ మీద వచ్చే సీన్, గుర్రం మీద వచ్చే సీన్ పెట్టారు. రెండింటిలోనూ పవన్ ఫేస్ పూర్తిగా కనబడదు. ఆ తర్వాతి నుంచి పవన్ అండ్ జబర్దస్త్ టీం కామెడీ ఎలా ఉండబోతుందో చూపించే షాట్స్ ఇన్వాల్వ్ చేశాడు డైరెక్టర్. చెక్కగుర్రం మీద కూర్చుని పవన్ ఆడుకోవడం ఫ్యాన్స్ ను విపరీతంగా నవ్విస్తుంది.
ఇక లాస్ట్ ఎండింగ్ షాట్ మాత్రం పీక్స్. పిల్లలందరూ గబ్బర్ సింగ్ గెటప్ లో పవన్ వెనక పరిగెత్తుకురావడంతో హి ఈజ్ బ్యాక్ టు డూ సమ్ థింగ్ అనిపించాడు డైరెక్టర్. కానీ పవన్ డైలాగ్ విందామని ఆశపడ్డ వాళ్లు మాత్రం 20 వ తేదీ వరకూ ఆగాల్సిందే..