English | Telugu
దిల్ రాజు సినిమాలు తగ్గించేస్తున్నాడా..?
Updated : Mar 17, 2016
ఆయనది గోల్డెన్ హ్యాండ్. ఏది ముట్టుకున్నా హిట్టే. తిరుగులేని ట్రాక్ రికార్డు. డబుల్ హ్యాట్రిక్ హిట్స్. కానీ ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ స్ట్రోక్స్తో డీలా పడిపోయాడు. ఒకానొక టైంలో పెర్ఫెక్ట్ జడ్జిమెంట్ అని పేరున్న ఆయన, ఇప్పుడు పూర్తిగా లెక్క తప్పేస్తున్నాడు. తప్పెక్కడ జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నంలో ఇప్పుడు లెక్క తగ్గించేస్తున్నాడట. ఆయన దిల్ రాజు అని ఇప్పటికే మీకు అర్ధమై ఉంటుంది. తాజా సమాచారం ప్రకారం నిక్కమైన మంచి నీలమొక్కటి చాలు అని భావిస్తున్నాడట రాజు గారు. టైం బాగోకపోవడంతో, చిన్న సినిమాలు చేసుకుంటూ వెళ్తున్న ఆయన ఎడాపెడా సినిమాలు తీసుకుంటూ పోవడం కంటే, మంచి సినిమా ఏడాదికి ఒక్కటి తీసినా చాలు అని ఫిక్సయ్యాడట.
అందుకే తన ప్రొడక్షన్ హౌస్ లో ముగ్గుర్ని తప్పించాడన్న న్యూస్ వినిపిస్తోంది. తన కింద పనిచేసే వాళ్లను బాగానే చూసుకుంటాడని దిల్ రాజుకు పేరు. మరి అలాంటిది స్టాఫ్ ను తగ్గించే పని పెట్టుకున్నాడంటే, అది తప్పకుండా కాస్ట్ కటింగే గురించే అని ఫిల్మ్ వర్గాలు అంటున్నాయి. ప్రస్తుతం దిల్ రాజు బ్యానర్లో, సాయి ధరమ్ ' సుప్రీం ' రిలీజ్ కు రెడీగా ఉంది. దీన్ని కూడా వేసవిలో స్టార్స్ సినిమాల సునామీ తర్వాత ప్రశాంతంగా రిలీజ్ చేయడానికి చూస్తున్నాడనే వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాతోనైనా రాజు గారు మళ్లీ పెద్ద సినిమాల లీగ్ లోకి బౌన్స్ అవుతారేమో చూడాలి.