English | Telugu
సర్దార్ సేవ్ అవ్వాలంటే 90 కోట్లు టార్గెట్..!
Updated : Apr 7, 2016
ఇంకొన్ని గంటల్లో సర్దార్ థియేటర్లలో సందడి చేయబోతోంది. బెనిఫిట్ షోలు, ప్రీమియర్ షోలు అంటూ సర్దార్ హడావిడి మామూలుగా లేదు. పవన్ ఫ్యాన్స్ పిచ్చ హ్యాపీగా ఉన్నా, డిస్ట్రిబ్యూటర్లకు మాత్రం గుండెల్లో దడగానే ఉంది. మొదటి షో పడి సినిమా హిట్ టాక్ తెచ్చుకుంటేనే సర్దార్ డిస్ట్రిబ్యూటర్స్ సేవ్ అయ్యేది. దాదాపు 80 కోట్లకు పైగా సర్దార్ కలెక్ట్ చేస్తేనే డిస్ట్రిబ్యూటర్ల షేర్ సేఫ్ అవుతుంది. ఆంధ్రా తెలంగాణా డిస్ట్రిబ్యూటర్లు 61 కోట్లకు సర్దార్ ను సొంతం చేసుకున్నారు. నైజాంకు 21 కోట్లు, సీడెడ్ కు 10.5 కోట్లకు సినిమా అమ్మేశారు. ఒక్క వైజాగ్ కే 7.2 కోట్లకు సినిమా అమ్ముడైంది. వెస్ట్(4.4 కోట్లు), ఈస్ట్(5.4 కోట్లు), కృష్ణా(4.3 కోట్లు), గుంటూర్(5.5 కోట్లు), నెల్లూర్ (2.7 కోట్లు). థియేట్రికల్ రైట్స్ ద్వారా సినిమాకు 61 కోట్లు వచ్చాయి. పక్క రాష్ట్రాల విషయానికొస్తే, కర్ణాటక(8.5 కోట్లు), తమిళనాడు(1.2 కోట్లు), రెస్ట్ ఆఫ్ ఇండియా(6 కోట్లు). పవన్ క్రేజ్ ను బేస్ చేసుకుని జరిగిన బిజినెస్ ఇది. ఓవర్సీస్ ను కూడా కలుపుకుంటే అక్కడ పదిన్నర కోట్లకు సినిమా వెళ్లింది.
ప్రపంచవ్యాప్తంగా థియేటర్ రైట్స్ రూపంలో 87 కోట్లు వచ్చాయి. ఈ లెక్కల్ని బట్టి చూస్తే, టోటల్ గా సర్దార్ మినిమం 90 కోట్లు తెచ్చుకుంటే గానీ, డిస్ట్రిబ్యూటర్లు ఒడ్డెక్కలేరు. 90 కోట్లు వస్తే, సర్దార్ సేఫ్ మూవీ అవుతుంది. మొత్తంగా బాక్సాఫీస్ దగ్గర 180 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తేనే సర్దార్ సక్సెస్ అయినట్టు. ఇది అవడానికి భారీ మొత్తమే అయినా, పవన్ క్రేజ్ బట్టి చూస్తే అసాధ్యమేమీ కాదు. కేవలం హిట్ టాక్ వచ్చినా, పవన్ మానియా సాయంతో డిస్ట్రిబ్యూటర్లు గట్టెక్కేసే అవకాశాలున్నాయి. సర్దార్ ఎవర్ని ఏం చేస్తాడో రేపు తెలుస్తుంది.