English | Telugu
వర్మ కంపెనీని స్వయంగా వచ్చి చూసిన సర్కార్..!
Updated : Apr 7, 2016
రాంగోపాల్ వర్మ టాలీవుడ్ ను వదిలేశానని, వంగవీటి తనకు ఇక్కడ చివరి సినిమా అని చెప్పిన సంగతి తెలిసిందే. ఇలాగే అంటాడు గానీ మళ్లీ తర్వాత వస్తాడులే అని తెలుగు ప్రేక్షకులు అనుకున్నారు. కానీ లేటెస్ట్ గా వర్మ ముంబైలో ఓపెన్ చేసిన కంపెనీ ఆఫీస్ చూస్తే, వర్మ నిజంగానే ముంబైకి పెర్మనెంట్ గా చెక్కేశాడేమో అని డౌట్ రాక మానదు. తనకున్నదంతా ఊడ్చేసి, ముంబైలో కంపెనీ అనే పేరుతో భారీ ఆఫీస్ ను ఓపెన్ చేశాడు వర్మ. మంచి విస్తీర్ణంలో, కాస్ట్లీ ఫర్నీచర్ తో చాలా రిచ్ గా ఈ ఆఫీస్ ను వర్మ నిర్మించుకున్నాడు. ఇకపై తన సినిమాల్ని ఏదో తీశామంటే తీశాం అన్నట్టుగా కాకుండా, తన టాలెంట్ తో మంచి సినిమాలు నిర్మించాలని, డైరెక్ట్ చేయాలని వర్మ అనుకుంటున్నాడట. కంపెనీ అంటూ పేరు పెట్టి, దీనికి తన సర్కార్ అమితాబ్ ను ఆహ్వానించాడు వర్మ. మొత్తం ఆఫీస్ ను అమితాబ్ బచ్చన్ తిరిగి చూశారు. ఒక గదిలో, వర్మ అమితాబ్ సర్కార్ లో ఉన్న స్టిల్ ను లైఫ్ సైజ్ లో గోడ మీద పెట్టుకోవడం విశేషం. ఇంతకీ ఇంత ఉన్న పళంగా, వర్మగారు అక్కడ కంపెనీ ఎందుకు ఓపెన్ చేశారు చెప్మా..?