English | Telugu

క‌త్తి హీరోయిన్‌ని అరెస్ట్ చేశారు!

క‌త్తి అంటే విజ‌య్ క‌త్తి అనుకొంటున్నారా..? అదేం కాదు. మ‌న స‌మంత చాలా మంచిది. ఈ క‌త్తి... క‌ల్యాణ్‌రామ్‌ది. ఆ సినిమాలో స‌నాఖాన్ అనే బాలీవుడ్ భామ క‌థానాయిక‌గా న‌టించింది. ఆ త‌ర‌వాత మిస్ట‌ర్ నోకియాలో చేసింది. స‌ల్మాన్ ఖాన్ జై హోలోనూ న‌టించింది. ఇప్పుడు క‌ట‌క‌టాల ఊస‌లు లెక్క‌పెడుతోంది. స‌నాఖాన్‌కీ, ఆమె ప్రియుడు ఇస్మాయిల్ నీ ముంబై పోలీసులు ఆరెస్ట్ చేశారు. ఇస్మాయిల్ త‌న‌ని లైంగికంగా వేధిస్తున్నాడ‌ని, స‌నాఖాన్‌తో క‌ల‌సి త‌న‌పై దాడి చేశాడ‌ని ఓ మ‌హిళ ముంబై పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. దాంతో స‌నాఖాన్‌ని అరెస్ట్ చేశారు. స‌నాకి పోలీసుల గొడ‌వ‌లు, పోలీస్ స్టేష‌న్ కొత్తేం కాదు. ఇది వ‌ర‌కు ఓ కిడ్నాప్ కేసులోనూ ఆమె అరెస్ట్ అయ్యింది. ఇది రెండోసార‌న్న‌మాట‌.

Dominic And The Ladies Purse Review: డొమినిక్ అండ్ ద లేడీస్ పర్స్ మూవీ రివ్యూ

సి.ఐ డొమినిక్ (మమ్ముట్టి) ప్రైవేట్ డిటెక్టివ్ గా చేస్తుంటాడు. అతడు గతంలో పోలీస్ ఆఫీసర్. ఇక అతనికి సహాయంగా ఉండేందుకు ఒక వ్యక్తి కావాలంటూ డొమినిక్ పేపర్ లో ప్రకటన ఇస్తాడు. దాంతో విక్కీ (గోకుల్ సురేశ్) అతడికి అసిస్టెంట్ గా  జాయిన్ అవుతాడు. ఒకరోజు డొమినిక్ ఉండే ఇంటి ఓనర్ మాధురి (విజీ వెంకటేశ్) అతని దగ్గరికి వచ్చి.. తను జనరల్ హాస్పిటల్ కి వెళ్లినప్పుడు ఒక 'పర్స్' దొరికిందని చెప్పి ఇస్తుంది. ఆ పర్స్ ఎవరిదో తెలుసుకుని వాళ్లకి అందజేయమని చెప్తుంది. దాంతో ఆ పర్స్ ఎవరిదో తెలుసుకునే పనిలో పడతాడు డొమినిక్. ఆ పర్స్ పూజ (మీనాక్షి ఉన్నికృష్ణన్) అనే యువతికి చెందినదని తెలుసుకుంటాడు. అయితే ఆ పర్స్ పారేసుకున్న రోజు నుంచి ఆమె మిస్సింగ్ అని తెలిసి షాక్ అవుతాడు...