English | Telugu

హుద్ హుద్ వ‌ల్ల మంచే జ‌రిగిందంటున్న హీరో!

హుద్ హుద్ తుపానుతో ప‌చ్చ‌టి ఉత్తరాంధ్ర మొత్తం కొట్టుకెళ్లిపోతే.. ఆ తుపాను వ‌ల్ల మంచే జ‌రిగిందంటున్నాడు ఓ హీరో. అయ్యో.. అవేం మాట‌లు...?? అంటూ నివ్వెర పోకండి. ఈ హీరో అంటున్న మాట‌ల్లోనూ కాస్త లాజిక్ ఉంది. ఇంత‌కీ ఆ హీరో ఎవ‌రంటే... మంచు మ‌నోజ్‌. ఆయ‌న హుద్ హుద్ కోసం ఇలా ఎందుకు స్పందించాడంటే... ''సెల్‌పోన్ల వ‌ల్ల‌ ప్ర‌పంచం చిన్న‌దైపోయింది అంటున్నారు. కానీ మ‌నుషుల మ‌ధ్య దూరం పెరిగిపోతోంది. ప్ర‌తి ఒక్క‌రూ.. సెల్ చేతిలో ప‌ట్టుకొని త‌మ లోకంలో తాము మునిగిపోతున్నారు. ఆడ‌వాళ్లు.. ఇంట్లో టీవీల‌కు అతుక్కుపోతున్నారు. పెద్ద‌వాళ్లు కులం మ‌తం జాతి అంటూ కొట్టుకొంటున్నారు. ఇప్పుడేమైంది..?? హుద్ హుద్ ఎలాంటి బేధం లేకుండా అంద‌రికీ న‌ష్టం క‌లిగించి వెళ్లిపోయింది. హుద్ హుద్ వ‌ల్లే.. అంద‌రూ మ‌ళ్లీ ఏక‌మ‌వుతున్నాం. కుల మ‌తాలు ప‌ట్టించుకోకుండా ఒక‌రికి ఒక‌రు సాయం చేసుకొంటున్నాం. సెల్‌ఫోన్లు ప‌నిచేయ‌ని రోజుల్లో అంద‌రూ ప‌క్క ప‌క్క‌న కూర్చుని మాట్లాడుకోగ‌లుగుతున్నాం. జ‌రగాల్సిన న‌ష్టం జ‌రిగిపోయింది. ఇప్పుడు ఎలా బాగుప‌డ‌దాం అంటూ సానుకూల దృక్ప‌థంతో ఆలోచించ‌గ‌లుగుతున్నాం. హుద్ హుద్ వ‌ల్ల‌.. ఇన్ని మంచి ప‌నులు జ‌రిగాయి...'' అంటున్నాడు. మ‌నోజ్ మాటల్లోనూ నిజం ఉంద‌నిపిస్తోంది క‌దూ..!

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.