English | Telugu
'సంబరాల ఏటి గట్టు' గ్లింప్స్.. మరో కేజీఎఫ్ అవుతుందా..?
Updated : Oct 15, 2025
సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ 'సంబరాల ఏటి గట్టు'. రోహిత్ కె.పి. దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ పీరియడ్ యాక్షన్ డ్రామాని ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. భారతదేశానికి స్వాతంత్య్రం రావడానికి ముందు.. రాయలసీమ ప్రాంతంలో కరవును అంతం చేయడానికి తపనపడే మరియు బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడే వ్యక్తి కథగా 'సంబరాల ఏటి గట్టు' చిత్రం తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈ చిత్రం నుంచి గ్లింప్స్ విడుదలైంది. (Sambarala Yeti Gattu Glimpse)
నేడు(అక్టోబర్ 15) సాయి ధరమ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా 'సంబరాల ఏటి గట్టు' గ్లింప్స్ ని రిలీజ్ చేశారు మేకర్స్. నిమిషం నిడివితో రూపొందించిన గ్లింప్స్ ఆకట్టుకుంటోంది. మైన్స్ లో బానిసల్లా పని చేస్తున్న ప్రజల తరపున నిలబడి, పోరాడే యోధుడిలా సాయి ధరమ్ తేజ్ పవర్ ఫుల్ గా కనిపిస్తున్నాడు. ఈ మూవీ సెటప్.. కేజీఎఫ్ ప్రపంచాన్ని గుర్తు చేసేలా ఉంది. ఇక సాయి తేజ్ మేకోవర్ కూడా మెప్పించింది. సరికొత్త అవతారంలో కనిపిస్తున్నాడు. "అసుర సంధ్య వేళ మొదలైంది. రాక్షసుల ఆగమనం" అంటూ సాయి తేజ్ చెప్పిన డైలాగ్ కట్టిపడేసింది. మూవీ సెటప్, సాయి తేజ్ లుక్, యాక్షన్, విజువల్స్, బీజీఎం ప్రతిదీ ఆకట్టుకున్నాయి. మరి ఈ సినిమాతో సాయి ధరమ్ తేజ్, సాలిడ్ పాన్ ఇండియా ఎంట్రీ ఇస్తాడేమో చూడాలి.