English | Telugu
ప్రముఖ నటి మిస్సింగ్! సీసీ టీవీ ఫుటేజ్ వైరల్
Updated : Oct 15, 2025
ఈటీవీ విన్ లో ప్రసారమైన వెబ్ సిరీస్ '90 's ఏ మిడిల్ క్లాస్ బయోపిక్ ' సాధించిన ఘన విజయం అందరికి తెలిసిందే. ఈ సిరీస్ లో 'దివ్య' అనే క్యారక్టర్ లో అద్భుతంగా నటించి అశేష ప్రేక్షాభిమానాన్ని సొంతం చేసుకున్న నటి 'వాసంతిక మచ్చా'(Vasanthika Macha). ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకోవడమే కాదు, తెలుగు సినిమాకి అచ్చ తెలుగు అమ్మాయి రూపంలో మరో మంచి నటి దొరికిందనే అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేసారు. రీసెంట్ గా సోషల్ మీడియాలో వాసంతిక కనపడటం లేదనే ప్రచారం జరుగుతుంది. ఇందుకు సంబంధించి సీసీ టీవీ ఫుటేజ్ కూడా నెట్టింట వైరల్ గా మారింది.
అయితే ప్రస్తుతం వాసంతిక 'డాటర్ ఆఫ్ ప్రసాదరావు కనపడటం లేదు' అనే వెబ్ సిరీస్ లో లీడ్ క్యారక్టర్ చేస్తుంది. సదరు సీసీ టీవీ ఫుటేజ్ అందుకు సంబంధించిందని, పబ్లిసిటీ కోసం అనే ప్రచారం కూడా బాగానే జరుగుతుంది. ఈ సిరీస్ అక్టోబర్ 31 నుంచి జీ 5 లో స్ట్రీమింగ్ కి రానుంది. అభిమానులు మాత్రం వాసంతిక సేఫ్ గా ఉండాలని సోషల్ మీడియా వేదికగా పోస్ట్ లు చేస్తున్నారు.
వాసంతిక బాలనటిగాను అనేక చిత్రాల్లో చేసింది. ప్రభాస్, ప్రశాంత్ నీల్ ల 'సలార్' లోను ముఖ్యమైన పాత్ర పోషించి ప్రేక్షకుల మన్ననలు అందుకుంది. తన నటనతో మనకి తెలిసిన పక్కింటి అమ్మాయిలా నటించడం వాసంతిక స్పెషాలిటీ. హైదరాబాద్ తన స్వస్థలం.