English | Telugu
హీరోయిన్ సమంతకు కూతురు కావాలట
Updated : Mar 16, 2016
అవునండీ..సమంతకు ఇప్పుడు అర్జెంట్ గా మూడు రోజుల్లో కూతురు కావాలట. ఎలాగో చెప్పండి అంటూ తన అభిమానుల్ని అడుగుతోంది. విషయంలోకి వెళ్తే, సమంత మహేష్ బాబుతో బ్రహ్మోత్సవం షూట్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఆ సమయంలో మహేష్ బాబు కూతురు సితారతో కాసేపు టైం స్పెండ్ చేసిన సమంత, ఆమెతో శనివారమంతా కలిసి ఆడుకోవడానికి డేట్ ఫిక్స్ చేసుకుంది. కానీ ఇక్కడే అసలు చిక్కొచ్చిపడింది. శనివారం నాతో ఆడుకోవడానికి వచ్చేప్పుడు, నీ కూతురిని కూడా తీసుకురా అని సితార అడిగిందట. దాంతో ఇప్పటికిప్పుడు నాకు కూతురు కావాలి ఎలా..? అంటూ సరదాగా ట్విట్లర్లో తన ఫాలోవర్లను అడుగుతోంది సమంత. మీ దగ్గర ఏమైనా సజెషన్ ఉంటే సమంతకు చెప్పేయండి మరి.