English | Telugu
చివరికి వచ్చేసిన బ్రహ్మోత్సవం షూటింగ్
Updated : Mar 16, 2016
బ్రహ్మోత్సవం టీం అంతా షూటింగ్ కోసం హరిద్వార్, ఉదయ్ పూర్ నగరాలు చుట్టిన సంగతి తెలిసిందే. తాజాగా అక్కడ షూటింగ్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకున్నారు యూనిట్. లేటెస్ట్ షూటింగ్ ఫోటోలను తన ట్విట్టర్లో అప్ లోడ్ చేశాడు సూపర్ స్టార్ మహేష్. హరిద్వార్, ఉదయ్ పూర్ లో లాంగ్ షెడ్యూల్ తర్వాత మళ్లీ సిటీకొచ్చేశాం. ఇంకొంచెం షూటింగ్ మిగిలి ఉంది అంటూ ట్వీట్ చేశాడు.
దీంతో షూటింగ్ ఇంక ఎంతో బ్యాలెన్స్ లేదని మహేష్ అభిమానులు హ్యాపీ అయిపోతున్నారు. ఇప్పటికే సినిమాను రీషూట్ చేస్తున్నారని, మహేష్ కు శ్రీకాంత్ అడ్డాలతో ప్రాబ్లెమ్ గా ఉందని రకరకాల పుకార్లు వినబడిన నేపథ్యంలో, తాజా ట్వీట్, ఫోటోలు అభిమానులకు రిలీఫ్ ను ఇచ్చాయి. ఈ సినిమాను పివిపి బ్యానర్ నిర్మిస్తోంది. మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్న బ్రహ్మోత్సవం రిలీజ్ పై త్వరలోనే మూవీ టీం ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది.