English | Telugu

మరోసారి జంటగా నాగచైతన్య సమంత

ముందు జనరేషన్ కు ఉన్నట్టుగా, హిట్ పెయిర్ కాంబినేషన్ ఈ జనరేషన్ కు లేదు. చిరంజీవి రాధ, వెంకటేష్ సౌందర్య, బాలకృష్ణ విజయశాంతి ఇలా ప్రతీ హీరోకు అప్పట్లో హిట్ పెయిరింగ్ ఉండేది. ఆ జంట కలిసి నటిస్తే, చూడటం కోసమే సినిమాకు వచ్చేవారు ఆడియన్స్. ఈ జనరేషన్లో అలాంటి గుర్తింపు తెచ్చుకున్న ఒకటి రెండు జంటల్లో నాగచైతన్య సమంత పెయిర్ ముందుంటుంది. తమ మొదటి సినిమాతో ఏమాయ చేశావే తోనే, వీళ్లిద్దరి కాంబో బాగుందే అనిపించుకున్నారు. ఆ తర్వాత ఆటోనగర్ సూర్య, మనం సినిమాల్లో జంటగా నటించి అలరించారు.

లేటెస్ట్ గా ఇద్దరి కాంబినేషన్లో నాలుగో సినిమా రాబోతోంది. ప్రస్తుతం ప్రేమమ్ లో నటిస్తున్న చైతూ, ఆ తర్వాత సోగ్గాడే ఫేం కళ్యాణకృష్ణ డైరెక్షన్లో నటించబోతున్నాడు. ఈ సినిమా కోసం సమంతను తీసుకోబోతున్నారని సమాచారం. ప్రేమమ్ లో స్కూల్ టీచర్ పాత్రకు సమంతను తీసుకోవాలనుకున్నా, డేట్స్ అడ్జెస్ట్ అవకపోవడంతో శ్రుతిహాసన్ ను తీసుకున్నారు. ఈసారి మాత్రం సమంత కూడా ఓకే చెప్పేసింది. త్వరలో మొదలవనున్న ఈ మూవీని అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించనుంది.

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.